IPL Auction: ఐపీఎల్ 2027 వేలంలో బెన్ స్టోక్స్‌కు గ్రీన్ సిగ్నల్.. హ్యారీ బ్రూక్‌పై వేటు.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2027 వేలంలో పాల్గొనేందుకు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు అర్హత ఉండగా, మరో ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌పై బీసీసీఐ నిబంధనల ప్రకారం నిషేధం కొనసాగుతోంది. మెగా వేలానికి దూరంగా ఉన్న విదేశీ ఆటగాళ్లకు, వేలంలో కొనుగోలు చేసిన తర్వాత వైదొలిగే ఆటగాళ్లకు వేర్వేరు నిబంధనలు వర్తించడమే దీనికి కారణం.
బెన్ స్టోక్స్ విషయంలో మెగా వేలం నిబంధన వర్తిస్తుంది. దీని ప్రకారం, మెగా వేలంలో పేరు నమోదు చేసుకోని విదేశీ ఆటగాడు ఆ తర్వాతి ఏడాది జరిగే వేలంలో పాల్గొనడానికి అనర్హుడు. పనిభారం, ఇంగ్లాండ్ కెరీర్ కారణాలతో స్టోక్స్ 2025 మెగా వేలంలో రిజిస్టర్ చేసుకోలేదు. అందుకే 2026 మినీ వేలానికి దూరంగా ఉన్నాడు. ఈ ఆంక్ష కేవలం ఆ తర్వాతి ఒక్క వేలానికే పరిమితం కాబట్టి, స్టోక్స్ ఇప్పుడు 2027 వేలంలో పాల్గొనేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు.
Also Read
- Tamil Nadu Government: TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై ఫిర్యాదు.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
- AP Rain Alert: ఏపీకి వర్ష సూచన.. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వానలు.. అలర్ట్ జారీ
- ICC Rankings: న్యూజిలాండ్‌పై అదరగొట్టిన బుమ్రా.. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారీ జంప్..
- Central Cabinet: కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. ఆ రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్..
మరోవైపు హ్యారీ బ్రూక్‌పై కఠినమైన నిబంధన అమల్లో ఉంది. వేలంలో పేరు నమోదు చేసుకుని, ఫ్రాంచైజీ కొనుగోలు చేసిన తర్వాత సీజన్ ప్రారంభానికి ముందే వైదొలిగే ఆటగాడిపై టోర్నీతో పాటు వేలం నుంచి రెండు సీజన్ల నిషేధం విధిస్తారు. 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 6.25 కోట్లకు బ్రూక్‌ను కొనుగోలు చేసినప్పటికీ, సీజన్ మొదలుకాకముందే అతడు తప్పుకున్నాడు. దీంతో 2027 సీజన్ ముగిసే వరకు బ్రూక్ ఐపీఎల్‌కు దూరంగా ఉండాల్సిందే.
చివరి నిమిషంలో ఆటగాళ్లు తప్పుకోవడం వల్ల జట్ల ప్రణాళికలు దెబ్బతింటుండటంతో ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు బీసీసీఐ ఈ నిబంధనలను తీసుకొచ్చింది. గతంలో జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్, మిచెల్ స్టార్క్ వంటివారు వేలం తర్వాత వైదొలగగా, వనిందు హసరంగ గాయాల కారణంగా పలు సీజన్లకు దూరమయ్యాడు. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ విడుదల చేయడంతో హసరంగ రూ. 2 కోట్ల బేస్ ప్రైస్‌తో తిరిగి వేలం బరిలోకి వచ్చాడు. కాగా, మొత్తం 1,220 మంది ఆటగాళ్లతో ప్రాథమిక జాబితా సిద్ధం కాగా, డిసెంబర్ 4, 2026న తుది వేలం జాబితాను విడుదల చేయనున్నారు.
తాజావార్తలు
-
IPL Auction: ఐపీఎల్ 2027 వేలంలో బెన్ స్టోక్స్‌కు గ్రీన్ సిగ్నల్.. హ్యారీ బ్రూక్‌పై వేటు.. కారణం ఇదే..
-
Tamil Nadu Government: TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌పై ఫిర్యాదు.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Arjun Kapoor : మలైకాతో బ్రేకప్ తర్వాత పదేళ్ల చిన్నదైన ఆ బ్యూటీతో అర్జున్ కపూర్ కొత్త లవ్ ట్రాక్?
-
AP Rain Alert: ఏపీకి వర్ష సూచన.. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వానలు.. అలర్ట్ జారీ
-
Nikhil Siddhartha: తెలుగు సినిమాల్లో ఆ చెత్త ఆగిపోవాలి
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!