Site icon NTV Telugu

Team India: రోహిత్ శర్మకు ఇంతకు తోడు దొరికేనా..?

Team India

Team India

భారత జట్టుకు ఓపెనర్ల సమస్య చాలా కాలం నుంచి వేధిస్తుంది. సచిన్‌-గంగూలీ, సచిన్‌-సెహ్వాగ్‌, గంభీర్‌-సెహ్వాగ్‌ల శకం ముగిసాక కొంతకాలం పాటు రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌ల జోడీ సక్సెస్ ఫుల్ గా కొనసాగింది. అయితే కాలక్రమంలో ధావన్‌ ఫామ్‌ కోల్పోవడంతో, కేఎల్‌ రాహుల్‌ సత్తా చాటడంతో గబ్బర్ క్రమేనా కనుమరుగైపోయాడు. కేఏ రాహుల్‌ అన్ని ఫార్మాట్లలో రాణించడంతో ధావన్‌ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు.

Read Also: Varun tej- Lavanya: పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

అయితే, ఇటీవలి కాలంలో బీసీసీఐ ఫార్మాట్‌కు ఓ జట్టును ప్రకటించడంతో.. సిరీస్‌, సిరీస్‌కు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో.. రెగ్యులర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తరుచూ గాయాల బారిన పడుతుండటంతో ఓపెనర్ల సమస్య మళ్లీ ప్రారంభమైంది. ఈ క్రమంలో రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా శుభ్‌మన్‌ గిల్‌ తెరపైకి వచ్చాడు. త్వరలో ఆసియా కప్‌, వన్డే వరల్డ్‌కప్‌ లాంటి మెగా టోర్నీలు ఉండటంతో బీసీసీఐకి ఓపెనర్ల సమస్య పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇక, సీనియర్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం, ఐపీఎల్‌-2023కి ముందు ఆ తర్వాత జరిగిన సిరీస్‌ల్లో ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌ లాంటి యువ ఓపెనర్లు సత్తా చాటడంతో సమస్య మరింత క్లిష్టమైంది.

Read Also: Shruti Haasan : బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ పోజులిచ్చిన హాట్ బ్యూటీ..

దీనికి తోడు ప్రస్తుతం జరుగుతున్న రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో పృథ్వీ షా చెలరేగుతుండటం బీసీసీఐని మరింత ఇరకాటంలో పడేసింది. మరోవైపు వెటరన్‌ శిఖర్‌ ధావన్‌కు ఆఖరి ఛాన్స్ ఇవ్వాలన్న డిమాండ్లు కూడా వస్తుండటంతో బీసీసీఐకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుతం లైమ్‌లైట్‌లో ఉన్న అందరు ఓపెనర్లను పరిగణలోకి తీసుకుంటే 90 శాతం అర్హులే ఉండటంతో సెలక్టర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఓపెనింగ్‌ స్థానాల కోసం రోహిత్‌తో పాటు మొత్తం 8 మంది లైన్‌లో ఉన్నారు. వీరితోనే సతమతమవుతుంటే యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌లు మేము సైతం ఉన్నామని అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో భారత సెలెక్టర్లు ఆసియా కప్‌, వన్డే వరల్డ్‌కప్‌లకు రోహిత్‌కు జతగా ఎవరిని టీమ్ లోకి ఎంపిక చేస్తారో అనేది వేచి చూడాల్సిందే.

Exit mobile version