Site icon NTV Telugu

Tollywood: చిరు, బాలయ్య, నాగ్.. వెంకీ మామను టచ్ చేసేదెవరు?

Chiranjeevi, Balakrishna, Nagarjuna, Venkatesh

Chiranjeevi, Balakrishna, Nagarjuna, Venkatesh

60 ప్లస్ అయితే సో వాట్.. భారీ టార్గెట్స్ చేధించగలం, చరిత్ర సృష్టించగలం, రికార్డులు తిరగరాయగలం అంటున్నారు సీనియర్ హీరోస్. తమ దృష్టిలో ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటున్నారు సౌత్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్. యంగ్ యాక్టర్లతో పాటు కాంపీటీటర్లకు అసలు సిసలైన మార్కెట్ చూపిస్తున్నారు ఈ ముగ్గురు. వంద కోట్లు కొట్టడమే గొప్ప ఎచీవ్ మెంట్ అనుకుంటున్న సౌత్ ఇండస్ట్రీలో నయా రికార్డులు సృష్టిస్తున్నారు. 70 ప్లస్ ఏజ్‌లో రజనీ, కమల్ లాంటి కోలీవుడ్ స్టార్ హీరోలు అబౌ 500 క్రోర్ కలెక్షన్లను చూపించి హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు.

రోబో 2.0, జైలర్‌తో 600 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన రజనీకాంత్.. జూనియర్ల ముందు బిగ్ టార్గెట్ ఉంచాడు. ఇప్పటి వరకు ఈ మార్క్ టచ్ చేసిన మొనగాడు కోలీవుడ్ ఇండస్ట్రీలో లేడు. దళపతి విజయ్, తలా అజిత్ లాంటి స్టార్ హీరోస్ కూడా ఈ టార్గెట్ టచ్ చేసేందుకు అవస్థలు పడుతున్నారు. ఇక 70ల్లోకి ఎంటరైన కమల్ కూడా ‘విక్రమ్’తో రూ.450 -500 కోట్లను కొల్లగొట్టి.. మళ్లీ తన హవా చూపించాడు. మరిన్ని రికార్డ్స్ సృష్టించేందుకు కమల్ సిద్దమయ్యాడు.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగు పిల్లర్లుగా భావించే చిరు, బాలయ్య, నాగ్ అందుకోలేని రేర్ ఫీట్ వెంకీ మామ టచ్ చేసి.. తన కొలిగ్స్ కు భారీ టార్గెట్ ఫిక్స్ చేశాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో రూ.300 కోట్లను క్రాస్ చేసిన తొలి సీనియర్ హీరోగా నిలిచి సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇప్పుడు తన కోస్టార్ల ముందు ఈ ఎచీవ్ మెంట్ ఓ మార్క్ గా మారిపోయింది. మరీ ఈ టార్గెట్ రీచ్ చేసే లేదా బ్రేక్ చేసే నెక్ట్స్ సీనియర్ హీరో ఎవరౌతారో చూడాలి.

Exit mobile version