Site icon NTV Telugu

Rajnikanth – Salman Khan : పాన్ ఇండియా స్టాయిలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్.. దర్శకుడు ఎవరంటే..?

Salmankhan ,rajinikanth

Salmankhan ,rajinikanth

Rajnikanth – Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ,సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ రాబోతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు అట్లీ గత ఏడాది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా తెరకెక్కించాడు. జవాన్ సినిమా బిగ్గెస్ట్ విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది. అయితే జవాన్ సినిమా తరువాత దర్శకుడు అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేసేందుకు ఫిక్స్ అయినట్లు సమాచారం.

Read Also :Kalki 2898 AD : సలార్ బుకింగ్స్ దాటేసిన ప్రభాస్ కల్కి..

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీ గా వున్న అల్లుఅర్జున్ షూటింగ్ పూర్తి కాగానే అట్లీ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రెమ్యూనరేషన్ ఇష్యూ వల్ల వీరిద్దరి కాంబో మూవీ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీనితో అట్లీ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.తాజా న్యూస్ ప్రకారం ఈ సినిమాలో తలైవా రజనీకాంత్ కూడా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో దర్శకుడు అట్లీ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఈ బిగ్గెస్ట్ మూవీని ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ తెరకెక్కించనున్నట్లు సమాచారం.  త్వరలోనే ఈ న్యూస్ పై స్పష్టత వచ్చే అవకాశం వుంది.

Exit mobile version