Site icon NTV Telugu

Uttar Pradesh: చేతి పంపులో నుంచి తెల్లని పాలలాంటి నీరు.. ఎగబడ్డ జనాలు

Up Water

Up Water

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. బిలారీ రోడ్‌వేస్ బస్టాండ్‌లో ఉన్న చేతి పంపు నుంచి తెల్లటి పాల లాంటి నీరు బయటకు వచ్చాయి. దీంతో అక్కడి జనాలు అది చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాకుండా దానిని తీసుకెళ్లడానికి జనాలు ఎగబడ్డారు. ఇళ్ల నుంచి బకెట్లు, ప్లాస్టిక్ సంచులు తెచ్చుకుని ఆ పదార్థాన్ని తీసుకుపోయేందుకు పెద్ద సంఖ్యలో గూమికూడారు. ప్రస్తుతం అక్కడ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: Extra – Ordinary Man Trailer: నితిన్ ఈసారి కొట్టేలానే ఉన్నాడమ్మా .. మైసమ్మ

అయితే.. ఈ విషయాన్ని తెలుసుకున్న పరిపాలన అధికారులు.. అక్కడికి వెళ్లి పరిశీలించారు. చేతిపంపు దగ్గర ఓ ప్లాట్ ఫాం ఉంది. అది విరిగిపోవడం వల్ల నీటిలో ఏదో ఒక పదార్ధం కలిసి ఇలా తెల్లగా నీరు బయటకు వస్తోందని.. అది కలుషిత నీరని తెలిపారు. మరోవైపు.. చేతి పంపు నుంచి తెల్లటి పాలలాంటి నీరు రావడంపై జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Read Also: HVF Recruitment 2023: హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..

ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించి.. మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ సింగ్ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అలాంటి పదార్థం, నీరు రావడం లేదు. బహుశా నీటి ప్లాట్‌ఫారమ్‌ తెగిపోవడంతో కుళాయి నుంచి బయటకు వచ్చే నీరు.. చేతిపంపులోని నీటిలో కలవడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. వెంటనే ప్లాట్‌ఫారమ్‌ పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత అది కలుషిత నీరని తెలుసుకుని వెంట పట్టుకుబోయిన పదార్థాన్ని పారబోశారు.

Exit mobile version