The Greatest Of All Time: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది గోట్ (The Greatest OF All Time ). ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కల్పతి ఎస్ అఘోరం ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Read Also: Committee Kurrollu: నిహారిక కమిటీ కుర్రోళ్ళు సందడి సందడి చేస్తున్నారు
శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటున్న ‘ది గోట్’ చిత్రం నుంచి ‘విజిలేస్కో’ అంటూ సాగే పాటను తాజాగా చిత్రం బృందం రిలీజ్ చేసింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ సాంగ్‌ను యువన్ శంకర్ రాజా, నక్ష అజీజ్ పాడారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజ్ కాబోతోంది.