NTV Telugu Site icon

Tragedy: రాఖీ పండగ వేళ విషాదం.. అన్నకు రాఖీ కట్టడానికి వెళ్తూ చెల్లి దుర్మరణం

Tragedy

Tragedy

Tragedy: ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ‘రాఖీ’ పండుగను నేడు ప్రపంచవ్యాప్తంగా హిందువులు సంతోషంగా జరుపుకుంటున్నారు. సోదరీమణులు తన సోదరుల చేతి మణికట్టుకు రాఖీలను కడుతున్నారు. సోదరులు కూడా తమ సోదరీమణులకు బహుమతి ఇచ్చి సంతోషపరుస్తున్నారు. సోదరసోదరీణుల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ వేళ కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అన్నకు రాఖీ కట్టడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చెల్లి దుర్మరణం పాలైంది.

Read Also: Heart Attack: కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు.. సీపీఆర్ చేసిన దక్కని ప్రాణం

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తమూలపేట వద్ద ఆటోను ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కోనపాప పేటకు చెందిన దేవి అనే 11 ఏళ్ల బాలిక మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా దుమ్ముల పేటలో అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బాలిక మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. రాఖీ కట్టేందుకు వస్తున్న చెల్లెలు మృతితో ఆ సోదరుడు బోరున విలపించాడు.