ఐపీఎల్ 2025 మెగా వేలం సోమవారం రాత్రి ముగిసింది. జెడ్డాలో ఆటగాళ్లకు సంబంధించి 10 ఫ్రాంచైజీల మధ్య రెండు రోజుల పాటు బిడ్డింగ్ జరిగింది. ప్రతి ఫ్రాంచైజీ తమ తమ జట్లలో 18 నుంచి 25 మంది ఆటగాళ్లకు చోటు కల్పించారు. ఈ క్రమంలో.. జట్లు బలాబలాలేంటి.. ఏ జట్టు వేలంలో ఆచితూచి అడుగులు వేసింది. ఏ ఫ్రాంచైజీ మంచి జట్టును సిద్ధం చేసింది.. ఏ ఫ్రాంచైజీ బలహీనమైన జట్టుగా ఉంది. వేలంలో ఏ ఫ్రాంచైజీ తప్పుడు నిర్ణయాలు తీసుకుందనే దానిపై క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ రేటింగ్ ఇచ్చారు. ఇంతకు ఏ జట్టుకు అత్యధిక రేటింగ్ ఇచ్చారో చూద్దాం.
UnstoppableS4 : బాలయ్య తో నవీన్ పోలిశెట్టి – శ్రీలీల సందడి
జియోస్టార్ (JioStar) ఎక్స్‌పర్ట్స్ ఐపీఎల్ మెగా వేలానికి రేటింగ్ ఇచ్చారు. వేలంలో ఏ ఫ్రాంచైజీ బాగా ఆలోచించి మంచి జట్టుగా తయారుచేశారో తెలిపారు. 19 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఈ రేటింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో ఉంది. ఎక్స్‌పర్ట్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు 10కి 8.8 రేటింగ్ ఇచ్చారు. అదే సమయంలో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అతి తక్కువ రేటింగ్ ఇచ్చారు. ఆర్‌సీబీకి 7.4 రేటింగ్ ఇచ్చారు. ఇతర జట్లతో పోలిస్తే తక్కువ రేటింగ్. 2024లో ఆడిన తన ఆటగాళ్ల కోసం ఆర్సీబీ పెద్దగా ఆసక్తి చూపలేదు.
Hair Care Tips: శీతాకాలంలో జుట్టుకు ఈ చిట్కాలు పాటిస్తే చుండ్రు రాదు..
ఢిల్లీ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోళ్లు చేసిందని ఎక్స్‌పర్ట్స్ అన్నారు. ఎస్‌ఆర్‌హెచ్‌కి 8.2 రేటింగ్ ఇవ్వగా.. ఐదుసార్లు ఐపిఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, అత్యధిక పర్స్‌తో వచ్చిన పంజాబ్ కింగ్స్‌లకు 8-8 రేటింగ్ లభించింది. ఐదవ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఉంది. దీనికి నిపుణులు 7.9 రేటింగ్ ఇచ్చారు. గుజరాత్ టైటాన్స్‌కు కూడా అదే రేటింగ్ ఇచ్చారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిని కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్‌కు 7.8 రేటింగ్ లభించింది. కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ 7.7-7.7 రేటింగ్‌ను పొందాయి. RCB 7.4 రేటింగ్ ఇచ్చారు.
ఎక్స్‌పర్ట్స్ రేటింగ్:
8.8 – ఢిల్లీ క్యాపిటల్స్
8.2 – సన్‌రైజర్స్ హైదరాబాద్
8 – ముంబై ఇండియన్స్
8 – పంజాబ్ కింగ్స్
7.9 – చెన్నై సూపర్ కింగ్స్
7.9 – గుజరాత్ టైటాన్స్
7.8 – లక్నో సూపర్ జెయింట్స్
7.7 – కోల్‌కతా నైట్ రైడర్స్
7.7 – రాజస్థాన్ రాయల్స్
7.4 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు