NTV Telugu Site icon

Viral Video : పెళ్లి డ్రెస్సులోనే ఓటువేసిన పెళ్లికూతురు.. ఎక్కడంటే?

Bride (2)

Bride (2)

భారతీయులకు ఓటు హక్కు చాలా విలువైనది.. గన్ కన్నా గొప్పది పెన్ను.. అలాగే దేశ అభివృద్ధి కోసం ఓటు అంత గొప్పది.. మనకు నచ్చిన నాయకుడిని ఓటు హక్కుతో ఎంపిక చేసుకోవచ్చు.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.. దేశం నలుమూలలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.. తాజాగా ఓ పెళ్లి కూతురు ఓటు వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

దేశవ్యాప్తంగా రెండో దఫా పోలింగ్ మొదలైంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 1,202 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 15.88 కోట్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు..

ఇదిలా ఉండగా.. ఉత్తర ప్రదేశ్ లోని బులంద్‌షహర్ లో ఓ నవ వధువు తన ఓటు హక్కును వినియోగించుకుంది.. ఓటు వేసేందుకు ఆమె తన పెళ్లి బట్టలలోనే అలాగే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటును వినియోగించుకుంది.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియో ను మీరు ఒకసారి చూసేయ్యండి..

Show comments