Samosa History: భారతదేశంలో సమోసా అంటే చాలా ఫేమస్. సాయంత్రం పూట స్నాక్స్ బ్రేక్ లో ఎక్కువగా తినే ఫుడ్.. దాదాపు సమోస అంటే అందరికి ఇష్టమే. అయితే అది మొట్టమొదటగా ఎక్కడ తయారైంది?. ఇండియాకు ఎలా వచ్చింది.? ఈ రుచికరమైన వంటకం చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.? ఇండియాలో సమోసాలు అంటే లొట్టలేసుకుని తింటారు. ఎక్కువగా చిన్నపిల్లలు ఈ వంటకాన్ని ఇష్టపడతారు. అయితే టీ షాపు, బేకరీ షాపులలో ఎక్కువగా దొరుకుతాయి. ఇండియాలో సమోసాలను ఎక్కువగా స్వీట్-గ్రీన్ చట్నీతో కానీ.. టీ తాగుతూ కానీ తింటారు. ఇది సింక్రెటిక్ డిష్ గా పిలువబడే వంటకం. అయితే సమోసా చరిత్ర ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భారతదేశంలో దీన్ని ఎప్పుడు తయారు చేయడం ప్రారంభించారు?.
Read Also: Viral Video : అమ్మో దండం తల్లే..నీ తెలివికి దండ వెయ్యాల్సిందే..
సమోసా మొదటగా ఇరాన్ లో తయారు చేశారు. అక్కడ దానిని సంబుష్క అని పిలుస్తారు. దీనిని మొదటిసారిగా 11వ శతాబ్దంలో పర్షియన్ చరిత్రకారుడు అబుల్ ఫజల్ బెహ్కీ తయారుచేశాడు. మొట్టమొదట సమోసాను మహమూద్ గజ్నవికి వడ్డించినట్లు సమాచారం. అయితే ఇరాన్ లో సంబుష్కగా ఉన్న వంటకం.. ఇండియాకు వచ్చేసరికి సమోసా పేరు మారింది. బీహార్ మరియు పశ్చిమ బెంగాల్‌లో సమోసను సింఘడ అని పిలుస్తారు.
ఈ రుచికరమైన వంటకం ఇరాన్ నుండి భారతదేశానికి వచ్చింది. ఇందుకోసం ఉజ్బెకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మీదుగా ఇక్కడి వరకు ప్రయాణించింది. ఆఫ్ఘనిస్థాన్‌లో డ్రై ఫ్రూట్స్‌కు బదులు మాంసం, ఉల్లిపాయలతోనే సమోసాలు తయారు చేసేవారని చెబుతున్నారు. ముఖ్యంగా జంతువులను మేపడానికి అడవికి వెళ్లే వారు దీనిని ఎక్కువగా తినేవారు. ఇరాన్ నుంచి భారత్‌కు చేరుకోగానే సగ్గుబియ్యం బంగాళాదుంపలతో సమోసాను తయారు చేశారు.
Read Also: Royal Tractor: బైక్ ట్రాక్టర్.. భలే ఉంది బాసూ
మరోవైపు భారతదేశంలో సమోసాల యొక్క వ్యాపారం భారీగా ఉంది. మన దేశంలో అనేక రకాల సమోసాలు ప్రసిద్ధి చెందాయి. వాటిలో ఎక్కువ భాగం బంగాళాదుంపలతో నిండిన సమోసాలు, చోలే-సమోసాలు, జామ్ సమోసాలు, నూడుల్స్ సమోసాలు, ఫిష్ సమోసాలు, పాస్తా, పంజాబీ మరియు కీమా , చీజ్, మష్రూమ్, కాలీఫ్లవర్ మరియు చాక్లెట్, ఉల్లిపాయ మరియు స్వీట్, చికెన్, పనీర్ సమోసా చాలా ఫేమస్ గా ఉన్నాయి.