Site icon NTV Telugu

Odisha Train Accidet: ఒడిశా రైలు ప్రమాదంలో మిస్సైన తెలుగు వారు ఎక్కడ..?

Train

Train

ఒడిశాలోని బాలేసూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రక్తపు మరకలు, మృతదేహాలు, క్షతగాత్రులతో ఆ ప్రాంతమంతా మృత్యుఘోష ఆవరించినట్లు ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 290 మంది చనిపోగా.. 1000 మందికి పైగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. వారిలో 793 మంది గాయాల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఇంకా ఆస్పత్రుల్లో 382 మందికి చికిత్స అందుతోంది. అయితే, క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

Also Read: Hyderabad : ట్యాంక్ బండ్ పై ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు ఢీ కొట్టడంతో సాఫ్ట్ వేర్ మృతి..

మరోవైపు ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసింది. దీంతో ట్రాక్ పనులు పునరుద్దరణ స్టార్ట్ అయింది. ఈ తరుణంలో రైలు ప్రమాదంలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికుల లెక్కపై గందరగోళం నెలకొంది. అసలు ఆ రెండు రైళ్లలో ప్రయాణిస్తున్న తెలుగువాళ్లు ఎంతమంది?.. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు.. ఎంతమంది గాయపడ్డారు.. ఎంతమంది ఈ ప్రమాదం నుంచి బయటపడి ఇళ్లకు చేరుకున్నారు.. ఎంత మంది ఆచూకీ లభించలేదు?.. అనే విషయాలపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇప్పటికీ గందరగోళం కొనసాగుతోంది.

Also Read: JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం

అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం మాత్రం కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 482మంది తెలుగువాళ్లు ఎక్కినట్లు తెలుస్తోంది. కాగా వారిలో 316మంది సేఫ్ గా బయటపడినట్లు టాక్. కాగా మిగిలిన 113మంది ఆచూకీ ఏమైపోయినట్లు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇదిలా ఉంటే జనరల్‌ బోగీల్లో ఎక్కిన తెలుగువాళ్లు ఎంతమంది?.. అనేది మాత్రం ఇంకా తెలియలేదు. మిస్సైన వారికి ఫోన్లు ద్వారా ట్రాక్ చేద్దామా అని చూసినకూడా తప్పిపోయిన ప్రయాణికుల ఫోన్లు స్విచ్ఛాప్ రావడంతో బంధువుల్లో మరింత టెన్షన్‌ నెలకొంది. ఇదిలా ఉంటే హౌరా ఎక్స్‌ప్రెస్‌లో 89మంది తెలుగువాళ్లు ప్రయాణిస్తే.. అందులో 49మంది సేఫ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా 28మంది ఆచూకీ లభించలేదు. జనరల్‌ బోగీల్లో మరో 50మంది వరకు తెలుగు ప్రయాణికులు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: Ruturaj Gaikwad: ప్రియురాలిని పెళ్లాడిన టీమిండియా యువ క్రికెటర్

దీంతో ఒడిశా రైలు ప్రమాదంలో మొత్తంగా 141 మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికుల ఆచూకీ లభించకపోవడంతో అధికారులు సైతం వారి కోసం ఆరా తీస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారు సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటున్నారు. పలువురు ప్రయాణీకులు.. ప్రత్యేక రైళ్లలో స్వస్థలాలకు తరలిస్తున్నారు.

Exit mobile version