Hyderabad : ట్యాంక్ బండ్ పై ఘోర రోడ్డు ప్రమాదం..బస్సు ఢీ కొట్టడంతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ సాఫ్ట్ వేర్ మృతి చెందాడు.వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చెయ్యబోయి బైక్ ను వేగంగా ఢీ కొట్టాడు.. దాంతో బైకర్ అమాంతం గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.. ఆ బస్సు అతనిపై నుంచి వెళ్లడంతో నుజ్జు నుజ్జు అయ్యాడు.. సమాచారం అందుకున్న పోలీసులు కేసును నమోదు చేశారు..
Also Read
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
పోలీసుల వివరాల మేరకు…హైదరాబాద్ శివారులోని శామీర్ పేట ఆలియాబాద్లో లక్ష్మీనారాయణ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతడి పెద్దకొడుకు మనోజ్ కుమార్ హైటెక్ సిటీలోని ఓ సాప్ట్ వేర్ కంపనీలో పనిచేస్తున్నాడు. అతనిది నైట్ షిప్ట్ కావడంతో రాత్రి విధులు ముగించుకుని తెల్లవారుజామున 5 గంటలకు ఇంటికి బయలుదేరాడు… ఈ క్రమంలోనే ప్రమాదానికి గురయ్యాడు..
ట్యాంక్ బండ్ మీదుగా బైక్ పై వెళుతున్న మనోజ్ ను ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. వేగంగా వెళుతున్న ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ముందున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి బైక్ వస్తున్న సంగతి గమనించలేదు.. దాంతో బైక్ ను ఢీ కొట్టింది..కిందపడిపోయిన అతని పై నుంచి బస్సు వెళ్లింది.. దాంతో అతడు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు.. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మనోజ్ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు. మృతుడి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.. ఆఫీస్ కు వెళ్లి కొడుకు ఇలా చనిపోయి రావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు..
తాజావార్తలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!