Tillu Square OTT: ఓటీటీలోకి టిల్లుగాడు వచ్చేది ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘టిల్లు స్క్వేర్ ‘.. మార్చి 29 న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతుంది.. ఆరు రోజుల్లోనే 91 కోట్ల కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. రెండు మూడు రోజుల్లో 100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.. గతంలో వచ్చిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.. ఇక ఈ సినిమా ఓటీటీలోకి త్వరలోనే రాబోతుంది..
సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్, అనుపమతో అతడి కెమిస్ట్రీ అభిమానులతో ఆకట్టుకుంటోన్నాయి. ఇప్పటివరకు తెలుగులో చాలా పద్దతిగా సాఫ్ట్ రోల్ చేస్తూ వచ్చిన అనుపమ ఈ సినిమాలో కాస్త బోల్డ్ గా కనిపించింది. సిద్దు పంచ్ డైలాగులు, కామెడీ టైమింగ్ హిలేరియస్‌గా థియేటర్లలో నవ్విస్తున్నాయి.. ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.. ఇక నేహా శెట్టి టిల్లు స్క్వేర్‌లో గెస్ట్ రోల్‌లో కనిపించింది. టిల్లు ఫ్రాంచైజ్‌లో భాగంగా మూడో పార్ట్ కూడా రాబోతోంది.. ఆ సినిమాకు టిల్లు క్యూబ్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.. ఆ సినిమాలో సూపర్ హీరోగా సిద్దు కనిపించబోతున్నారని సమాచారం..
Also Read
ఇక ఈ సినిమా నెలలోపే ఓటీటీలోకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. రిలీజ్‌కు ముందే టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది. ఫ్యానీ రేటుకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఏప్రిల్ 26 నుంచి టిల్లు స్క్వేర్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ప్రస్తుతం సినిమా కలెక్షన్స్ కూడా పెరుగుతుండటంతో ఈ డేట్ మారే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. మరి ఎప్పుడు ఓటీటిలోకి వస్తుందో తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యాలి..
తాజావార్తలు
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!