Site icon NTV Telugu

Vijay Varma : తమన్నా తో పెళ్ళెప్పుడు..?.. ఫన్నీ ఆన్సర్ ఇచ్చిన విజయ్ వర్మ..

Whatsapp Image 2024 02 03 At 12.46.59 Pm

Whatsapp Image 2024 02 03 At 12.46.59 Pm

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ, స్టార్ హీరోయిన్ తమన్నా..గతేడాది వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. అప్పటి నుండి వారు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతీసారి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నిస్తున్నారు. విజయ్ వర్మ, తమన్న ఇద్దరూ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. వారికి సంబంధించిన సినిమా అప్డేట్స్ తో పాటు పలు పర్సనల్ విషయాలు కూడా ఇందులో షేర్ చేసుకుంటారు. వీరిద్దరు కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే వెబ్ ఫిల్మ్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ విషయం బయటికొచ్చిన తర్వాత వీరిద్దరూ కూడా తాము రిలేషన్షిప్ లో ఉన్నట్టు ఒప్పుకున్నారు. అంతే కాకుండా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పలుమార్లు బయటపెట్టారు. ప్రస్తుతం విజయ్ వర్మ, తమన్నా.. ఎవరి కెరీర్లో వారు బిజీగా ఉన్నారు..అయితే వీరి పెళ్లి గురించి ప్రశ్నలు మాత్రం వీరిని వేధిస్తూనే ఉన్నాయి.

తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించిన విజయ్ వర్మకు మళ్లీ అలాంటి ప్రశ్నే ఎదురయ్యింది.దానికి విజయ్ వర్మ తెలివిగా సమాధానమిచ్చాడు.ఇంస్టాగ్రామ్ లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ ను ఏర్పాటు చేసిన విజయ్ వర్మకు ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు’ అంటూ ఒక ఫ్యాన్ అతడిని ప్రశ్నించారు. ఆ ఫ్యాన్ తన మేనకోడలే అని చెప్తూ.. ‘నా కోడలు ఇప్పుడు అమ్మలా ప్రశ్నలు అడుగుతోంది. పైగా నాకు ఈ ప్రశ్న హైదరాబాదీ యాసలో వినిపిస్తోంది’ అంటూ తన మేనకోడలికి కౌంటర్ ఇచ్చాడు విజయ్ వర్మ. ఈ నటుడి స్మార్ట్ సమాధానం చూసి ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ వర్మ గానీ, తమన్నా గానీ వారి ప్రేమ గురించి తప్ప పెళ్లి గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఇష్టపడటంలేదు. కానీ 2024లో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కే అవకాశం ఎక్కువగా ఉందని సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి.

Exit mobile version