NTV Telugu Site icon

Akhilesh Yadav: సీఎం పర్యటనకు వెళ్తే మాఫియా స్వాగతం పలుకుతుంది.. అఖిలేష్ సంచలన కామెంట్స్

Akhilesh Yadav

Akhilesh Yadav

Akhilesh Yadav: సమాజ్‌వాదీ పార్టీ అధినేత సంచలన కామెంట్స్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అన్ని అక్రమ నిర్మాణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన కార్యక్రమాలను మాఫియా ద్వారా స్వాగతిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆదివారం ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను అప్రతిష్టపాలు చేసేందుకు అధికార బీజేపీ సీబీఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన అఖిలేష్ యాదవ్.. బిజెపికి వ్యతిరేకంగా బలంగా పోరాడుతున్న ప్రతిపక్ష నేతల ప్రతిష్టను ఈ కేంద్ర ఏజెన్సీలను ఉపయోగించుకుని చెడగొడుతున్నారని అన్నారు.

Read Also: Budget Session: రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. విపక్షాల టార్గెట్ ఆదే అంశం

జరుగుతున్న దాడులన్నీ రాజకీయాలే.. బీజేపీ ఉద్దేశం సరిగా లేదని విమర్శించారు. దేశ ప్రజలకు అవగాహన, సున్నితత్వం ఉందని.. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని తెలిసి అందుకే దాడులు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. మహమూదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు విలేకరులతో మాట్లాడారు. బీజేపీ రాజ్యాంగాన్ని, చట్టాన్ని అంగీకరించదని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో నేడు జరుగుతున్న అక్రమ నిర్మాణాలన్నీ బీజేపీ నేతలవేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లినప్పుడు మాఫియా స్వాగతం పలుకుతుందని సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి తనపై ఉన్న కేసులను ఉపసంహరించుకున్నారని, ఉపముఖ్యమంత్రిపై ఉన్న కేసులను కూడా ఉపసంహరించుకున్నారని, అందుకే సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం రాష్ట్రంలోని టాప్ 100 మాఫియా జాబితాను విడుదల చేయడం లేదని ఆరోపించారు.