NTV Telugu Site icon

Hindi Diwas 2024: హిందీ దివస్ ఎందుకు జరుపుకుంటారు?

Hindi Diwas

Hindi Diwas

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీ దినోత్సవంగా జరుపుకుంటారు. హిందీ భాష ప్రచారానికి ఇది ముఖ్యమైన రోజు అని చెప్పవచ్చు. హిందీ దేశ సాంస్కృతిక ఐక్యతను ప్రతిబింబిస్తుంది. ఈ రోజు మన సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేస్తుంది. కొత్త తరానికి మాతృభాషపై గర్వపడేలా చేస్తుంది. హిందీ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. హిందీ ప్రాయుఖ్యతను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది. అయితే.. మన మాతృభాష తెలుగు ఒక్కటే కాకుండా.. హిందీ గురించి కూడా అవగాహన ఉండటం మనకు అవసరం. ఎందుకంటే హిందీ జాతీయ భాష కాబట్టి. ఇప్పుడు మనం హిందీ భాష గురించి తెలుసుకుందాం.

READ MORE: Israel: ఇజ్రాయిల్‌పై విరుచుకుపడిన హిజ్బుల్లా.. రాకెట్లతో దాడి..

హిందీ దివస్ ఎప్పుడు ప్రారంభమైంది?

హిందీ దినోత్సవం 14 సెప్టెంబర్ 1949 నుంచి ప్రారంభమైంది. సుదీర్ఘ చర్చ తర్వాత దేవనాగరి లిపిలో హిందీని దేశ అధికార భాషగా ప్రకటించారు. హిందీ దినోత్సవం కోసం అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సెప్టెంబర్ 14వ తేదీని ఎంచుకున్నారు. కానీ రాష్ట్రీయభాషా ప్రచార సమితి సూచన మేరకు 1953లో తొలిసారిగా హిందీ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభమైంది. ఈ రోజును ప్రత్యేకంగా చేయడానికి, హిందీ ప్రాముఖ్యతను పెంచడానికి, హిందీ దివస్ వేడుకను ప్రారంభించారు.

READ MORE:Smart Tv: రూ. 15,000 ధరలో స్మార్ట్ టీవీలు.. ఓ సారి లుక్కేయండి..!

హిందీ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు?

ప్రముఖ హిందీ కవి బెయోహర్ రాజేంద్ర సింహా జయంతి సందర్భంగా హిందీ దివస్ జరుపుకుంటారు. హిందీకి ప్రత్యేక హోదా కల్పించడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వారిలో గోవింద్ దాస్, హజారీ ప్రసాద్ ద్వివేది, కాకా కలేల్కర్, మైథిలీ శరణ్ గుప్త్ వంటి వారు ఉన్నారు. ఈ రోజు వారి జన్మదినాన్ని కూడా సూచిస్తుంది.

READ MORE: Betting At Munneru: రూ.2వేల పందెం కోసం మున్నేరులో దూకిన యువకుడి మృతదేహం లభ్యం

హిందీ దివాస్ చరిత్ర, ప్రాముఖ్యత ఏమిటి?

1949లో రాజ్యాంగ సభ హిందీని భారతదేశ అధికార భాషగా గుర్తించింది. దీనిని అధికార భాషగా కూడా ప్రకటించారు. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క 22 అధికారిక భాషలలో ఒకటి. భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1949 నుంచి ఏటా హిందీ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. హిందీ భాష, హిందీ సాహిత్యాన్ని గౌరవించేందుకు, హిందీ దివస్ సందర్భంగా దేశవ్యాప్తంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ రోజున, మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పబ్లిక్ అండర్‌టేకింగ్‌లు, జాతీయం చేయబడిన బ్యాంకులు మరియు పౌరులు హిందీ భాషకు గణనీయమైన కృషి చేసినందుకు రాజభాష కీర్తి పురస్కార్, రాజభాష గౌరవ్ పురస్కార్ వంటి అవార్డులను అందుకుంటారు.

READ MORE: Deepjyoti: ప్రధాని నివాసంలో కొత్త సభ్యుడు.. “దీప్‌జ్యోతి”తో మోడీ ఫోటోలు

భారతదేశంలో హిందీ సాహిత్యం..

భారతదేశంలో హిందీ సాహిత్యం కూడా గొప్ప కృషిని కలిగి ఉంది. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు హిందీ సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేసింది. కబీర్, తులసీదాస్, ప్రేమ్‌చంద్, మహాదేవి వర్మ, ఇతర రచయితలు, కవులు హిందీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. హిందీ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం హిందీ ప్రచారాన్ని ప్రోత్సహించడం. దానికి అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వడం. యువతకు హిందీ, సాహిత్యం ప్రాముఖ్యతను తెలియజేసి… హిందీ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను రక్షించడానికి సంఘం కృషి చేస్తోంది.