Whatsapp Update: వాట్సాప్ వినియోగదారుల కోసం సరికొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్
- వాట్సాప్ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్.
- iOS యూజర్ల కోసం ఒక కొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్ విడుదల.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Whatsapp Update: వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా iOS యూజర్ల కోసం ఒక కొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ అప్డేట్ ద్వారా ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లు మరింత సులభంగా కాల్స్ చేయగలుగుతారు. ఇప్పటివరకు కాంటాక్ట్ లిస్టులో లేని నంబర్లకు కాల్ చేయడం కష్టం. కానీ. ఈ కొత్త ఫీచర్‌తో ఇది మరింత సులభం కానుంది. వాట్సాప్ కొత్త అప్డేట్లో భాగంగా, కాల్స్ ట్యాబ్‌లో సెకండరీ వ్యూను జోడించింది.
Also Read: Hyderabad: ఇన్‌స్టాలో పరిచయం.. పెళ్లి పేరుతో మోసం.. ట్విస్ట్ ఏంటంటే..?
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇందులో మూడు ముఖ్యమైన షార్ట్‌కట్స్ ఉన్నాయి. కొత్త కాల్ చేయడం, కాల్ లింక్ క్రియేట్ చేయడం, మాన్యువల్‌గా ఫోన్ నంబర్ ఎంటర్ చేయడం (ఇది ఈ అప్డేట్కు ముఖ్యమైన ఫీచర్)ని జోడించారు. ఇందులో మూడో ఆప్షన్ ద్వారా మీరు మీ కాంటాక్ట్స్‌లో సేవ్ చేయని నంబర్‌కు కూడా డైరెక్ట్‌గా కాల్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీరు నంబర్ సేవ్ చేయకుండానే వాట్సాప్‌లో కాల్ చేయవచ్చు. మీరు కాల్ చేయాలనుకున్న నంబర్ వాట్సాప్‌లో ఉంటే, ఆ నంబర్‌ను కాంటాక్ట్స్‌లో సేవ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్‌గా చాట్ ప్రారంభించవచ్చు. ఇది వాట్సాప్ యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
iOS యూజర్లు కాల్స్ ట్యాబ్‌లో ఉన్న ‘+’ గుర్తుపై నొక్కితే, ‘డయల్ నంబర్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా నేరుగా ఫోన్ నంబర్ ఎంటర్ చేసి, దానికి సంబంధించిన వెరిఫికేషన్ చెక్ చేయవచ్చు. ఒకవేళ ఆ నంబర్ వాట్సాప్‌లో ఉంటే నేరుగానే కాల్ చేయవచ్చు లేదా చాట్ ప్రారంభించవచ్చు. ఇది ప్రతి వాట్సాప్ యూజర్‌కు మరింత సులభమైన కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ దశలవారీగా విడుదల చేయనుంది. ప్రస్తుతం ఇది కొంతమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కానీ, కొంతకాలంలో ఈ ఫీచర్ అన్ని యూజర్లకు అందుబాటులో వస్తుంది. మీరు వెంటనే ఈ ఫీచర్ పొందాలంటే వాట్సాప్‌ను యాప్ స్టోర్ లేదా టెస్ట్‌ఫ్లైట్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు.
Also Read: Donald Trump : టీవీ యాంకర్ అడిగిన ఏ ప్రశ్నకు కోపంతో ఊగిపోయిన ట్రంప్
వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లకు మరింత సులభమైన కమ్యూనికేషన్ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది. ఈ కొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్ ద్వారా మీ ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్నవాళ్లకైనా, లేనివాళ్లకైనా సులభంగా కాల్ చేయవచ్చు. ఇది అన్ని యూజర్లకు మరింత సులభమైన, వేగవంతమైన కాలింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!