NTV Telugu Site icon

WhatsApp Update: చాట్ లిస్ట్ కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న వాట్సాప్

Whatsapp

Whatsapp

WhatsApp Update: వాట్సాప్ బీటాలో ప్రీసెట్ చాట్ లిస్ట్‌లను తొలగించే ఫీచర్‌ను వాట్సాప్ ఆండ్రాయిడ్ 2.24.23.23 వర్షన్ ద్వారా విడుదల చేసింది. ఈ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు ‘అన్ రీడ్’, ‘గ్రూప్స్’ వంటి ప్రీసెట్ ఫిల్టర్‌లను తీసివేయవచ్చు. దీన్ని చేయడానికి వినియోగదారులు చాట్ ఇంటర్‌ఫేస్‌ లోని ఫిల్టర్‌ను నొక్కి పట్టుకోవడం ద్వారా తొలగించు ఎంపికను యాక్సెస్ చేయవచ్చు. ఫిల్టర్‌ లను నిర్వహించడానికి కంపెనీ ఇప్పుడు కొత్త ఇంటర్‌ఫేస్‌ను పరీక్షిస్తోంది. WABetaInfo గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ 2.24.25.8 కోసం వాట్సాప్ బీటాలో ఈ కొత్త ఫీచర్‌ను అందిస్తోంది.

Also Read: Relationship Tips: ఆ సమస్యల కారణంగా లైంగిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు.. జాగ్రత్త మరి

WABetaInfo ఈ సమాచారాన్ని సోషల్ మీడియా పోస్ట్‌ ద్వారా తెలిపింది. ఈ పోస్ట్‌లో కొత్త ఫీచర్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. ఈ స్క్రీన్‌షాట్‌లో మీరు చాట్ జాబితాను నిర్వహించడానికి కొత్త ఇంటర్‌ఫేస్ సంబంధించిన విజువల్ చూడవచ్చు. కొత్త ఇంటర్‌ఫేస్ ఇదివరకు కంటే చాలా బాగా ఉంది. వాట్సాప్ వినియోగదారులు దీన్ని చాలా ఇష్టపడతారు అందంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక్కడ మీరు కొత్త ఫిల్టర్‌లను ఏర్పాటు చేసుకోవడానికి షార్ట్‌కట్‌లతో పాటు ‘ఇష్టమైనవి’, ‘వివిధ సంభాషణలు’ వంటి ప్రధాన ఫిల్టర్‌లను మనం చూడవచ్చు. ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్నాక రీడిజైన్ చేయబడిన బటన్‌ను కూడా కనపడుతుంది.

Also Read: Fish Oil Benefits: అందంగా, యవ్వనంగా కనపడాలంటే ఫిష్ ఆయిల్ ట్రై చేయాల్సిందే

కొత్త బటన్‌లు యాప్‌లోని ఇతర బటన్‌ల మాదిరిగానే ఉంటాయి. కాకపోతే ఇవి యాప్‌ను మరింత ఆధునికంగా కనిపించేలా చేస్తాయి. జాబితాలను సృష్టించడం, నిర్వహించడం ఇంకా తొలగించడం కోసం మొత్తం ఇంటర్‌ఫేస్ భద్రత, మెయిల్ సెట్టింగ్‌లు వంటి యాప్‌లోని ఇతర విభాగాలకు సరిపోయేలా రీడిజైన్ చేయబడింది. కంపెనీ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను అందిస్తోంది. బీటా టెస్టింగ్ పూర్తయిన తర్వాత, దాని స్థిరమైన వెర్షన్ గ్లోబల్ యూజర్‌ల కోసం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

Show comments