Site icon NTV Telugu

WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

Whatsapp In Ipad

Whatsapp In Ipad

WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల ఇన్నాళ్ల నిరీక్షణకు చెక్ పెడుతూ.. మెటా సంస్థ అధికారికంగా వాట్సాప్ కోసం ప్రత్యేక iPad యాప్‌ను విడుదల చేసింది. దశాబ్దానికి పైగా వినియోగదారులు డిమాండ్ చేస్తున్న ఈ సౌకర్యం తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు iPad వినియోగదారులు వాట్సాప్ వెబ్ ఆధారంగా పరిమిత ఫీచర్లతోనే ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు యాప్ స్టోర్ లో ప్రత్యేకంగా రూపొందించిన వాట్సాప్ ఫర్ iPad యాప్‌ లభిస్తోంది.

Read Also: Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

ఈ కొత్త యాప్‌ ద్వారా ఒకేసారి 32 మందితో వీడియో, ఆడియో కాల్స్ చేయవచ్చు. అలాగే ముందు, వెనుక కెమెరాల మద్దతుతో పాటు.. కాల్ సమయంలో స్క్రీన్ షేరింగ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ ఇప్పుడు iPadOS మల్టీటాస్కింగ్ ఫీచర్లను పూర్తిగా వినియోగించుకునేలా రూపొందించబడింది. స్టేజ్ మేనేజర్, స్ప్లిట్ వ్యూ, స్లయిడ్ ఓవర్ వంటి ఫీచర్ల మద్దతుతో ఇతర యాప్‌లతో పాటు వాట్సాప్ ను కూడా ఒకేసారి ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, వేరే బ్రౌజర్ లో బ్రౌజ్ చేస్తూనే వాట్సాప్ లో మెసేజ్‌కు స్పందించవచ్చు లేదా ఈమెయిల్స్ చెక్ చేస్తూనే కాల్‌లో కొనసాగవచ్చు.

ఇక మ్యాజిక్ కీబోర్డు, ఆపిల్ పెన్సిల్ వంటివి ఉపయోగించే వారికి ప్రత్యేక మద్దతు ఉంది. దీంతో iPad‌పై వాట్సాప్ వినియోగదారుల అనుభవం మరింత మెరుగవుతుంది. iPad‌ యాప్‌ కూడా మెటా మల్టీ-డివైస్ సింక్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. ఇది ఐఫోన్ లేకపోయినా వాట్సాప్ యాప్‌ను iPad‌లో అనుసంధానించుకునే సౌకర్యం కల్పిస్తుంది. ముఖ్యంగా, అన్ని డివైసెస్‌లో మెసేజ్‌లు, మీడియా, కాల్స్‌ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్‌తో భద్రంగా ఉంటాయి.

Read Also: TS High Court: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌!

iPad‌ యాప్‌లో చాట్ లాక్ అనే ప్రత్యేకమైన భద్రతా ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది. దీని ద్వారా ఇతరులతో iPad షేర్ చేసినా, ముఖ్యమైన సంభాషణలను రహస్యంగా ఉంచుకోవచ్చు. ఇక యాప్ విడుదలకు సంబంధించి మెటా సంస్థ స్పందిస్తూ.. ఈ ఫీచర్‌ కోసం చాలా కాలంగా వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు పూర్తి వాట్సాప్ అనుభవాన్ని iPad‌కు తీసుకురావడం గర్వంగా ఉందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ యాప్‌ గ్లోబల్‌గా అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని ఫీచర్లతో మరింతగా మెరుగుపరుస్తామని మెటా సంకేతాలు ఇచ్చింది.

Exit mobile version