Site icon NTV Telugu

WhatsApp Voice Chat: వినియోగదారుల కోసం క్రేజీ అప్డేట్ తీసుకొచ్చిన వాట్సాప్‌.. అసలు ఈ ఫీచర్ ఎల్లా పనిచేస్తుందంటే..?

Voice Chat

Voice Chat

WhatsApp Voice Chat: మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్ వాట్సాప్ మరో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. తాజాగా “వాయిస్ చాట్” అనే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఈ ఫీచర్‌తో గ్రూప్ సభ్యులు లైవ్ ఆడియోలో పరస్పరం మాట్లాడుకుంటూనే చాట్‌లో మెసేజ్‌లను కొనసాగించగలుగుతారు.

ఎలాగి పనిచేస్తుంది ఈ వాయిస్ చాట్?
ఇంతకు ముందు వాయిస్ చాట్ సదుపాయం 33 మందికి మాత్రమే అందుబాటులో ఉండగా, తాజాగా ఇదే ఫీచర్‌ను 256 మందికి విస్తరించారు. అంటే, ఒక గ్రూపులో ఉన్న ఏ సభ్యుడైనా వాయిస్ చాట్ ప్రారంభించవచ్చు. అయితే, ఈ చాట్ కాస్త భిన్నంగా ఉంటుంది. అంటే ఇతరులకు నోటిఫికేషన్ వెళ్లదు. కానీ, ఎవరైనా అవసరమైతే వాయిస్ చాట్‌లో చేరొచ్చు లేదా ఎప్పుడు కావాలన్నా వాయిస్ చాట్ నుండి వెళ్లొచ్చు. ఈ వాయిస్ చాట్ ప్రారంభించిన వెంటనే, అది గ్రూప్ చాట్ దిగువ భాగంలో కనిపిస్తుంది. ఇందులో ఎవరెవరు ఉన్నారో చూడొచ్చు. ఇది పూర్తిగా ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్‌తో పని చేస్తుంది. అలాగే సాధారణ వాట్సాప్ కాల్స్, మెసేజ్‌ లలానే గోప్యంగా ఉంటుంది.

Read Also: Realme GT 7: లాంచ్ కాకముందే.. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన రియల్‌మీ GT 7.. ఎలాగంటే?!

వాయిస్ చాట్ ఎలా ప్రారంభించాలి?
* మొదటగా గ్రూప్ చాట్ ఓపెన్ చేయండి.

* పైభాగంలోని వాయిస్ చాట్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి.

* అక్కడ “Start Voice Chat” పై క్లిక్ చేయండి.

* ఇతరులకు కాల్ గా కాకుండా ఒక పుష్ నోటిఫికేషన్ మాత్రమే వెళుతుంది.

* చాట్ దిగువలో ఎవరెవరు వాయిస్ చాట్‌లో ఉన్నారో చూపించే బ్యానర్ కనిపిస్తుంది.

Read Also: Bride Calls Off Wedding: తాళి కట్టే సమయంలో ఝలక్ ఇచ్చిన పెళ్లికూతురు.. చివరకు లవర్‌తో..!

ఈ ఫీచర్ వల్ల మీరు వాయిస్ చాట్‌లో లేనప్పటికీ, ఎవరెవరు ఉన్నారో గ్రూప్ హెడర్ లేదా కాల్స్ ట్యాబ్‌లో చూసేయచ్చు. అలాగే గ్రూప్ మెసేజ్‌లు, కాల్ అలర్ట్‌లను మ్యూట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. వాయిస్ చాట్‌లో ఎవరూ ఉండకపోతే లేదా ఒక గంటలోపుగా ఎవరూ జాయిన్ కాకపోతే, అది ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. వాయిస్ చాట్ నుంచి బయటకు రావాలంటే “Leave Voice Chat”ను ట్యాప్ చేయాల్సి ఉంటుంది.

ఈ వాయిస్ చాట్ ఫీచర్ త్వరలోనే గ్లోబల్ స్థాయిలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులందరికీ లభ్యం కానుంది అని వాట్సాప్ ప్రకటించింది. ఇంతవరకూ గ్రూప్ కమ్యూనికేషన్‌లో మెసేజ్‌లకే పరిమితమైన వాట్సాప్, ఇప్పుడు ఈ వాయిస్ చాట్ ఫీచర్‌తో మరింత ఇంటరాక్టివ్‌గా మారనుంది.

Exit mobile version