Site icon NTV Telugu

WhatsApp: 36 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్.. ఒక్క నెలలోనే!

Whatsapp1

Whatsapp1

ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఐటీ రూల్స్‌కు వ్యతిరేకంగా ఉన్న 36.77 లక్షల వాట్సాప్ అకౌంట్లను నిలిపివేసినట్లు వెల్లడించింది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య నిబంధనలకు అనుగుణంగా లేని ఖాతాలు, యూజర్లు ఫిర్యాదు చేసిన ఖాతాలు.. మొత్తం 36.77 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. వాటిలో 13.89 లక్షల అకౌంట్లను యూజర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకముందే, ఐటీ రూల్స్‌కు అనుగుణంగా లేవని గుర్తించి బ్యాన్ చేసింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఇండియా నెలవారీ నివేదికలో వాట్సాప్ ఈ వివరాలను వెల్లడించింది.

Also Read: Milk Price Hike: పాలధరలు మరోసారి పెంపు..లీటర్‌పై ఎంతంటే?

భారత ప్రభుత్వం కఠిన ఐటీ రూల్స్‌ను 2022లో అమల్లోకి తీసుకువచ్చింది. వీటి ప్రకారం.. 50 లక్షలకు మించి సబ్ స్క్రైబర్లు ఉన్న అన్ని మేజర్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నెలవారీగా తమకు అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలు మొదలైన వాటిని పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలపై మొదట ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర మేజర్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ వ్యతిరేకత వ్యక్తం చేశాయి. విద్వేష ప్రచారం, తప్పుడు వార్తల సర్క్యులేషన్, శాంతి భద్రతలను దెబ్బతీసే వార్తలు వైరల్ కావడం.. మొదలైన వాటిని అడ్డుకోవడం కోసం భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని మేజర్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఐటీ రూల్స్‌ను కచ్చితంగా పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Also Read: Dinesh karthik: కోహ్లీ వారసుడు గిల్ కాదు.. దినేశ్ కార్తీక్ వింత స్టేట్‌మెంట్

Exit mobile version