1. నేడు యాదగిరిగుట్టకు బండి సంజయ్. ఎమ్మెల్యేలు కొనుగోలు డ్రామా కుట్ర బయటపెట్టేందుకు శ్రీలక్ష్మీనరసింహ స్వామి దగ్గర బండి సంజయ్ ప్రమాణం.
2. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.47,100 లుగా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,280 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.63,500 లుగా ఉంది.
3. నేడు టీ20 వరల్డ్ కప్‌లో ఉదయం 9.30గంటలకు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ ఢీ.
4. నేడు రెండో రోజు కేంద్ర హోంశాఖ చింతన్ శిబిర్. సూరజ్‌కుండ్‌లో కొనసాగుతున్న చింతన్ శిబిర్. సైబర్ నేరాలు, మహిళల భద్రతపై సదస్సు.
5. నేడు రైతుల పాదయాత్రపై ఏపీ హైకోర్టులో విచారణ. అన్ని పిటిషన్లను మధ్యాహ్నం వింటామన్న హైకోర్టు. ఆదేశాలు అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం.
6. నేడు వైద్యారోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష. హాజరుకానున్న మంత్రి విడదల రజని, ఉన్నతాధికారులు.
7. నేడు హైదరాబాద్‌లోని పికెట్ నాలా బ్రిడ్జి ప్రారంభం. బ్రిడ్జిని ప్రారంభించనున్న మంత్రి తలసాని. నాలా విస్తరణలో రసూల్‌పురా దగ్గర బ్రిడ్జి నిర్మాణం.
