Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

1. నేడు విద్యాసంస్థల బంద్‌కు ఓయూ జేఏసీ, ఏబీవీపీ పిలుపు. ప్రీతి మృతికి నిరసనగా బంద్‌కు పిలుపు.

2. గాంధీలో ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి. గాంధీ నుంచి వరంగల్‌కు ప్రీతి మృతదేహం తరలింపు. పోలీసు భద్రత మధ్య ప్రీతి మృతదేహం తరలింపు. నేడు ప్రీతి స్వగ్రామం గిర్నితండాలో అంత్యక్రియలు.

3. నేడు హనుమకొండలో మంత్రి కేటీఆర్‌ పర్యటన. సోడాషపల్లిలో రైతువేదికను ప్రారంభించనున్న మంత్రి. మధ్యాహ్నం 3 గంటలకు కేటీఆర్‌ బహిరంగ సభ.

4. నేడు పలు ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు. లింగంపల్లి, హైదరాబాద్‌, ఫలక్‌నుమా మార్గంలో 19 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.

5. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. కేసును సీబీఐకి అప్పగించడంపై తెలంగాణ సర్కార్‌ పిటిషన్‌.

6. దివంగత డైరెక్టర్‌ కె.విశ్వనాథ్‌ సతీమణి జయలక్ష్మి కన్నుమూత. నేడు పంజాగుట్ట శ్మశానవాటికలో జయలక్ష్మి అంత్యక్రియలు.

7. యాదాద్రిలో ఏడో రోజు బ్రహ్మోత్సవాలు. తూర్పురాజగోపురం మాడవీధుల్లో నేడు స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం.

8. నేడు మార్చి నెల వసతి కోటా టికెట్లు విడుదల. తిరుపతి, తిరుమల, తలకోనలో అద్దె గదుల కోటాను ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్న టీటీడీ.

9. నేడు కర్ణాటకలో ప్రధాని మోడీ పర్యటన. శివమొగ్గ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్న మోడీ. రూ.450 కోట్లతో శివమొగ్గ విమానాశ్రయం అభివృద్ధి. కమలం ఆకారంలో సరికొత్త టెర్మినల్‌ భవనం.

10. నేడు రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల. రూ.16,800 కోట్లు విడుదల చేయనున్న మోడీ. 13వ విడత కింద రూ.16,800 కోట్లు విడుదల.

11. నేడు మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు. 59 స్థానాలకు జరగనున్న ఎన్నికలు. మేఘాలయలో 3,419 కేంద్రాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు. నాగాలాండ్‌లో 2,291 కేంద్రాల్లో పోలింగ్‌.

Exit mobile version