NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. నేడు ఏపీలో 23 మండలాల్లో తీవ్ర వడగాల్పులు. ఏపీలోని 330 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం. తెలంగాణలోనూ కొనసాగుతున్న వడగాల్పులు.

2. జూలై 1 నుంచి ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు. ఈ రోజు నుంచి జూలై 17 వరకు ఆషాడమాసం సారె సమర్పణ. జూలై 2న దుర్గమ్మకు సారె, బంగారు బోనం సమర్పణ. సమర్పించనున్న హైదరాబాద్‌ మహంకాళి బోనాల కమిటీ.

3. ఏపీలో ఒంటిపూట బడులు పొడిగింపు. ఈ నెల 24వరకు పొడిగిస్తూ ఏపీ సర్కార్‌ నిర్ణయం. వేడిగాలుల తీవ్రత తగ్గకపోవడంతో పొడిగింపు.

4. నేటి నుంచి ఈనెల 25 వరకు పలు రైళ్లు రద్దు. రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.

5. నేటి నుంచి 24 వరకు పలు ఎంఎంటీసీ రైళ్లు రద్దు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్ పరిధిలో పనులు కొనసాగుతుండడంతో పలు రైళ్లు రద్దు.

6. నేడు ఇరిగేషన్ శాఖ పై సీఎం జగన్ కీలక సమీక్ష. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం. పోలవరం సహా రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాజెక్టుల పనుల పురోగతి పై సమీక్ష చేపట్టనున్న సీఎం.

7. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. పార్టీ అనుబంధ విభాగాల సమీక్షలు పూర్తి చేసిన విజయసాయిరెడ్డి. జగనన్న సురక్షా కార్యక్రమానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయటం, అనుబంధ విభాగాల జిల్లా కమిటీల నిర్మాణం పై కసరత్తు.

8. మోడీ 9 ఏళ్ళ పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు సేవ- సుపరిపాలన, పేదల సంక్షేమంపేరుతో తూర్పుగోదావరి జిల్లా రాజముద్రలో భారీ బహిరంగ సభ. స్థానిక క్వారీ సెంటర్ సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ. పాల్గొననున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల సోము వీర్రాజు, బీజేపీ జాతీయ నాయకురాలు పురంధేశ్వరి.

9. నేడు సుప్రీం కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ. అవినాష్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సునీతా రెడ్డి. సునీత పిటిషన్ ను విచారణ జరపనున్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం.

Show comments