Whats Today Updates 15.08.2022
1. విజయవాడలో స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వేడుకలు. ఉదయం 9 గంటలకు జెండా ఎగురవేయనున్న సీఎం జగన్. పలు శాఖలకు చెందిన 15 శకటాల ప్రదర్శన. వంద అడుగుల భారీ జెండా ఆవిష్కరణ.
2. నేడు క్షమాభిక్షతో పలు జైళ్ల నుంచి ఖైదీల విడుదల. సత్ప్రవర్తన కలిగిన వారిని విడుదలకు నిర్ణయం.
3. స్వాతంత్ర్య వేడుకలకు గోల్కొండలో ఏర్పాట్లు. ఉదయం 10.30 గంటలకు జెండా ఎగురవేయనున్న సీఎం కేసీఆర్. తర్వాత గౌరవ వందనం సమర్పించనున్న బలగాలు. వెయ్యి మంది కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు.
4. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బండి సంజయ్ యాత్ర. నేడు జనగామ జిల్లా దేవరుప్పల నుంచి ప్రారంభం. 12 రోజులు కొనసాగనున్న ప్రజా సంగ్రామ యాత్ర. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 160 కిలోమీటర్ల పాదయాత్ర.
5. విశాఖలో నేడు రెండో రోజు అగ్నివీర్ ఎంపికలు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహణ. రిక్రూట్మెంట్‌కు భారీగా హాజరైన అభ్యర్థులు. తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న ఎంపికలు.
6. సాయంత్రం రాజ్‌భవన్ తేనేటీ విందు కార్యక్రమం. హాజరుకానున్న సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు.
7. తెలంగాణలో ఆర్టీసీలో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు. నేడు 75 ఏళ్లు పై బడిన వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. నేడు పుట్టబోయే చిన్నారులకు 12 ఏళ్లు వచ్చే వరకు బస్సుల్లో ఉచిత ప్రయాణం. నేడు కిలో పార్శిల్ 75కిలో మీటర్ల వరకు ఉచిత రవాణా.
8. నేటి నుంచి దేవాలయాల్లో రాగి నాణేల విక్రయం. స్వతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా నిర్ణయం. కొండగట్టు, బాసర, ధర్మపురి, యాదగిరిగుట్ట, వేములవాడ, కొమురవెల్లి, తాడ్‌బండ్, సంగారెడ్డి రుద్రారం గణపతి ఆయలంలో విక్రయం. వరంగల్‌భద్రాకాళి, సికింద్రాబాద్ మహంకాళీ ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో నాణేల విక్రయాలు.
9. నేడు ఉదయం 7.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రసంగిస్తారు.
