Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today Ntv

Whats Today Ntv

1. నేడు గుజరాత్‌ తొలి దశ ఎన్నికలు. ఉదయం 8గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం. 19 జిల్లాల్లోని 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌. తొలి దశలో బరిలో నిలిచిన 788 మంది అభ్యర్థులు. 14,382 పోలింగ్‌ స్టేషన్లు సిద్ధం చేసిన అధికారులు. అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను నిలిపిన కాంగ్రెస్‌, బీజేపీ.

2. నేడు రాజ్‌భవన్‌కు వైఎస్‌ షర్మిల. ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ తమిళిసైని కలవనున్న షర్మిల.

3. నేటి నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాలు మార్పు. ఉదయం 7.30 నుంచి 8 గంటల మధ్య వీఐపీ బ్రేక్‌ దర్శనాలు.

4. నేటి నుంచి విద్యార్థులకు ఫేస్‌ అటెండెన్స్‌ అమలు. ఏపీలోని డిగ్రీ కాలేజిల్లో ఫేస్‌ అటెండెన్స్‌.

5. నేడు జగిత్యాల పర్యటనకు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్‌ స్కాం రిమాండ్‌ రిపోర్ట్‌పై కవిత స్పందించే అవకాశం.

6. నేడు ఢిల్లీకి ఎంపీ రవిచంద్ర, మంత్రి గంగుల కమలాకర్‌. సీబీఐ ముందు హాజరుకానున్న రవిచంద్ర, గంగుల కమలాకర్‌.

7. నేటి నుంచి షర్మిల పాదయాత్ర తిరిగి ప్రారంభం. నర్సంపేట లింగగిరి నుంచి షర్మిల పాదయాత్ర. ఆగిన చోట నుంచే పాదయాత్ర ప్రారంభించనున్న షర్మిల.

8. విజయనగరంలో నేడు ఎయిడ్స్ డే సందర్భంగా నగరంలో ఆరోగదయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ.

9. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48,550లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,850లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 68,000లుగా ఉంది.

Exit mobile version