Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

* నేడు అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. మూసీ పునరుజ్జీవం, ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాల నిర్మాణం, హైడ్రాపై సమీక్షించనున్న సీఎం రేవంత్..

* నేడు కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. కాళేశ్వరంపై NDSA నివేదికను వివరించనున్న ఉత్తమ్.. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై నివేదిక ఇచ్చిన NDSA..

* నేడు తెలంగాణ బీజేపీ కీలక సమావేశం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న సునీల్ బన్సల్.. సంస్థాగత ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ..

* నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ SIPB కీలక సమావేశం.. రాష్ట్రంలో పెట్టుబడులపై సమీక్షించనున్న చంద్రబాబు..

* నేడు వైసీపీ జిల్లాల అధ్యక్షులతో భేటీకానున్న జగన్.. తాజా రాజకీయ పరిణామాలు, కేసులపై చర్చ..

* నేడు పహల్గామ్ అమరులకు జనసేన నివాళి కార్యక్రమం.. పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఉదయం 10 గంటలకి కార్యక్రమం..

* నేడు ఏపీ రాజ్యసభ ఎన్నిక నామినేషన్లకు చివరి రోజు.. నామినేషన్ల దాఖలుకు మధ్యాహ్నం 3గంటల వరకు గడువు.. బీజేపీ అభ్యర్థిగా బరిలో పాక వెంకట సత్యనారాయణ..

* నేడు శ్రీశైలం డ్యామ్ ను పరిశీలించనున్న NDSA.. డ్యామ్ గేట్ల దిగువన ఉన్న భారీ గొయ్యి పూడ్చివేత.. పనులు ప్రారంభించే అంశంపై సమీక్షించనున్న NDSA బృందం..

* నేటి నుంచి తెలంగాణ ఎప్ సెట్ పరీక్షలు.. రోజూ రెండు సెషన్లలో ఎప్ సెట్ పరీక్షలు.. ఉదయం 9గంట నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్.. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండో సెషన్.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నో ఎంట్రీ.. తెలంగాణ వ్యాప్తంగా 124 కేంద్రాల్లో పరీక్షలు..

* నేడు ఐపీఎల్ లో ఢిల్లీ వర్సెస్ కోల్ కతా మధ్య కీలక పోరు.. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకి మ్యాచ్..

Exit mobile version