* నేడు విశాఖ సీఐఐ సమ్మిట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఈ నెల 14,15 తేదీల్లో విశాఖలో సీఐఐ సమ్మిట్.. సీఐఐ సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్న సీఎం..
* నేడు పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
* నేడు పలమనేరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. ఉదయం 11 గంటలకు ముసలిమడుగులోని కుంకీ ఏనుగుల శిబిరం.. గజరామం, వరదవనాన్ని ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం పవన్..
* నేడు గుంటూరులో శంకర్ విలాస్ ఫ్లై ఓవర్, మిర్చి యార్డు వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..
* నేడు బాపట్ల జిల్లాలో కేంద్ర బృందం పర్యటన.. జిల్లా కలెక్టరేట్ లో పంట నష్టంపై ఫొటో ప్రదర్శన, అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన.. మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో దెబ్బతిన్న పంటలు, రోడ్లు, కాలువలను పరిశీలించి నష్ట పరిహారం అంచనా వేయనున్న కేంద్ర బృందం..
* నేటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి ముగింపు.. ఇవాళ సాయంత్రం 5గంటల వరకే ప్రచారానికి గడువు.. మైకులు, నేతల ప్రచారాలు బంద్.. సాయంత్రం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆంక్షలు.. ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ ప్రచారం..
* నేడు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేంద్రమంత్రి బండి సంజయ్.. బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పాదయాత్ర.. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్..
* నేటి నుంచి ఢిల్లీ- చైనాలోని షాంఘైకి విమాన సర్వీసులు.. వారంలో 3 రోజుల పాటు అందుబాటులో సర్వీసులు..
* నేటితో ముగియనున్న బీహార్ అసెంబ్లీ మలివిడత ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్ పార్టీ మహాఘఠ్ బంధన్ కూటమి ఎన్నికల ప్రచారం.. రెండు ప్రచార సభల్లో పాల్గొననున్న రాహుల్ గాంధీ..
* నేడు ఉత్తరాఖండ్ కు ప్రధాని మోడీ.. ఉత్తరాఖండ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరుకానున్న మోడీ..
