నేడు ఉదయం 11గంటలకు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ఏపీ సీఎం చంద్రబాబు.. జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు ర్యాలీ.. తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్న చంద్రబాబు..
నేడు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. రేపు వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొననున్న జగన్మోహన్ రెడ్డి..
నేడు మంత్రి బాల వీరాంజనేయ స్వామి టంగుటూరు మండలం నాయుడుపాలెంలో ఉంటారు.. స్థానిక కార్యక్రమాలకు హాజరవుతారు..
నేడు ఒంగోలు లో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పలు కార్యక్రమాలకు హాజరవుతారు..
నేడు టౌన్ కొత్త రోడ్డులో జగన్నాథ స్వామి రథయాత్ర.. టర్నర్ చౌల్ట్రీ వరకు జరిగే రథయాత్రలో పాల్గోనున్న వేలాది మంది భక్తులు.. విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..
నేడు కోడుమూరు శ్రీ వల్లెలాంబదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళహారతి, అభిషేకాలు, కుంకుమార్చనలు..
నేడు నగరంలో యూపీఎస్సీ పరీక్ష.. పది కేంద్రాలలో పరీక్షకు హాజరుకానున్న 5,275 మంది అభ్యర్దులు..
నేటి నుంచి పూరి జగన్నాథ రథయాత్ర.. జగన్నాథ రథయాత్రకు తొలిసారి హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రెండు రోజుల పాటు జరగనునన్న పూరీ జగన్నాథస్వామి ఉత్సవాలు..
నేడు భారత్ – జింబాబ్వే మధ్య రెండో టీ20.. హరారే వేదికగా సాయంత్రం 4. 30 గంటలకు మ్యాచ్ ప్రారంభం..
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today