NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* అమరావతి: నేడు ఉదయం 10 గంటలకు కలెక్టర్ల సదస్సు.. వివిధ శాఖలపై సమీక్ష చేయనున్న సీఎం చంద్రబాబు.. సాయంత్రం ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్ష.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వరుసగా సీఎం సమీక్ష..

*ప్రకాశం : గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించనున్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి..

* తిరుమల: 9వ తేదీన గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహన సేవ.. 19వ తేదీన శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ

* అనకాపల్లి జిల్లా: చోడవరం వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నికల ప్రచారం… ఆత్మీయ సమావేశంకు హాజరుకానున్న చోడవరం, మాడుగుల నియోజకవర్గాల ZPTC, ఎంపీటీసీలు

* అనంతపురం: గుంతకల్లు రూరల్ పరిధిలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేపాలయంలో నేటి నుంచి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసిన అధికారులు.

* ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మళ్లీ స్వల్పంగా పెరిగిన గోదావరి వరద ఉధృతి .. గడిచిన ఆరు గంటలలో రెండు పాయింట్ మేరకు పెరిగిన వరద నీటిమట్టం.. బ్యారేజ్ వద్ద 8.90 అడుగులకు చేరిన నీటిమట్టం

* విశాఖ: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం… టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమక్షంలో జరగనున్న కూటమి నేతల భేటీ.. ఎన్నికల వ్యూహం, ఆశావహుల జాబితా స్కృటినీ..

* కర్నూలు: సుంకేసుల జలాశయంకు కొనసాగుతున్న వరద.. ఇన్ ఫ్లో 1,11,000 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 1,07,536 క్యూసెక్కులు.. 26 గేట్ల ఎత్తివేత

* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,356 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,815 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.9 కోట్లు

* నంద్యాల: నేటి నుండి శ్రీశైలంలో సెప్టెంబర్ 4 వరకు శ్రావణ మాసోత్సవాలు.. నేటి నుండి శ్రావణమాసమంతా అఖండ శివనామ భజనలు.. ఈనెల 15 నుంచి 19 వరకు శ్రీస్వామివారి స్పర్శదర్శనం నిలుపుదల.. అలంకార దర్శనానికి అనుమతి.. శ్రావణ శని, ఆది, సోమ, పౌర్ణమి రోజులలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు,ఆర్జిత సేవలు నిలుపుదల

* నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో 4,41,183 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 40, 516 క్యూసెక్కులు.. ప్రస్తుత నీటిమట్టం 580 అడుగులు .. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.. ఎడమ కాలువ ద్వారా 4,679 క్యూసెక్కుల నీటి విడుదల.. కుడికాలువ ద్వారా 8,067 క్యూసెక్కుల నీటి విడుదల.. విద్యుత్ ఉత్పత్తి కోసం 26,250 క్యూసెక్కులను విడుదల చేస్తున్న ప్రాజెక్టు అధికారులు.

* ఖమ్మం: నేడు మధిరలో భట్టి విక్రమార్క పర్యటన.. ఇండస్ట్రియల్ పార్క్ కు శంఖుస్థాపన

* రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్న క్షేత్రంలో నేటి నుండి శ్రావణమాసం ఉత్సవాలు ప్రారంభం.. నేటి నుండి నెల రోజులపాటు శ్రావణమాసం పురస్కరించుకొని సోమ, శుక్రవారములలో స్వామి,అమ్మ వారలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆలయ అర్చకులు.. మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన ఆలయ అర్చకులు.. సాయంత్రం స్వామివారి కల్యాణ మండపంలో మహా లింగార్చన

* రాజన్న సిరిసిల్ల జిల్లా: మొదటి శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.. శ్రావణ సోమవారం కావడంతో స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుండి క్యూలైన్లో బారులు తీరిన భక్తులు.. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం

* రాజన్నసిరిసిల్ల జిల్లా: నేటి నుండి వేములవాడ రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనాలు.. ప్రారంభించనున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. ప్రతి రోజూ రెండు సార్లు భక్తుల సౌకర్యార్థం బ్రేక్ దర్శనాలు.. బ్రేక్ దర్శనం టికెట్ ఒక్కరికి రూ.300.. పదేళ్లలోపు చిన్నా రులను ఉచిత దర్శనం.. ప్రతి రోజు ఉదయం 10.15 నుంచి 11.15 గంటల వరకు ఒకసారి, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు మరోసారి బ్రేక్ దర్శనం

* ఖమ్మం: నేడు ఖమ్మం నగర పాలకసంస్థ సర్వ సభ్య సమావేశం..

* శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు.. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.. ఇన్ ఫ్లో 3,46,410 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 3,74,676 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులు.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి