NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* హైదరాబాద్‌: ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్​ సిక్ విలేజీలోని హాకీ గ్రౌండ్‌లో ఫ్యామిలీ డిజిటల్​ కార్డుల కుటుంబ డిజిటల్ కార్డ్‌ల పైలెట్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30కు సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్​. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు, డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్​.. అపాయింట్​మెంట్​ ఆర్డర్ల ప్రక్రియను సమీక్షిస్తారు. 4.15కు ఎల్​బీ స్టేడియంలో చీఫ్ మినిస్టర్ కప్​ 2024 ప్రారంభోత్సవం. మస్కట్, లోగో, పోస్టర్ల విడుదల.

* తిరుమల: నేడు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. రేపటి నుంచి ప్రారంభంకానున్న బ్రహ్మోత్సవాలు.. రేపు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.. రేపు రాత్రి పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు

* రాజన్నసిరిసిల్ల జిల్లా: నేటి నుండి వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ దేవి నవరాత్రి మహోత్సవములు.. 10 రోజుల పాటు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు.. నేటి నుండి 12 తేదీ వరకు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు.. 11 తేదీన రాజన్న ఆలయ ధర్మగుండంలో అమ్మవారి తెప్పోత్సవం.. 12 తేదీ రోజు విజయ దశమి, ఆయుధపూజ, శమియాత్ర.. ప్రతిరోజు పార్వతి శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తుల తో పట్టణంలో పెద్ద సేవ ఊరేగింపు.. మొదటిరోజు శైలపుత్రి అలంకారంలో దర్శనం ఇవ్వనున్న అమ్మవారు

* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్ ల పర్యటన.. గజ్వేల్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం, కళ్యాణాలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు

* నేడు సంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన.. న్యాల్కల్ మండలంలో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలుపనున్న హరీష్ రావు

* మెదక్: నేటి నుంచి ఏడు పాయలలో వనదుర్గ భవాని శరన్నవరాత్రి ఉత్సవాలు.. నేడు బాలత్రిపుర సుందరి అవతారంలో అమ్మవారిని అలంకరించిన అర్చకులు.. ఈ నెల 12వరకు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్న అమ్మవారు

* ప్రకాశం : త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు మరియు శ్రీ పార్వతి దేవి అమ్మవార్ల శరన్నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభం.. మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు… పల్లకి సేవ పద్మవాహనం..

* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ వద్ద విశాఖ ఉక్కును పరిరక్షించాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో మూడవ రోజుల నిరసన కార్యక్రమాలు..

* ప్రకాశం: చీమకుర్తి మండలం రామతీర్థంలో పలు సమస్యల పరిష్కారం కోసం గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ల ఓనర్ల సమావేశం..

* ప్రకాశం : ఇవాళ్టి నుంచి టెట్ పరీక్షలు.. జిల్లా వ్యాప్తంగా నాలుగు సెంటర్ల కేటాయింపు.. హాజరుకానున్న 11,566 మంది అభ్యర్థులు..

* కాకినాడ: రత్నగిరిలో నేటి నుంచి దసరా ఉత్సవాలు.. తొమ్మిది రోజులపాటు వనదుర్గ కనకదుర్గ అమ్మవారులకు ప్రత్యేక పూజలు.. విజయదశమి రోజున చండీ హోమం పూర్ణాహుతి, సాయంత్రం శమీ పూజ

* తిరుమల: ఇవాళ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. సాయంత్రం మాడ వీధులలో ఉరేగునున్న శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు.. రేపు మధ్యహ్నం మాడ వీధులలో ఉరేగునున్న పరివార దేవతలు, గరుడపఠం.. రేపు సాయంత్రం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. రేపు రాత్రి పెద్దశేష వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి

* ఏలూరు: నేడు పోలవరంలో PPA సీఈఓ అతుల్ జైన్ పర్యటన.. ఎగువ, దిగువ కాపర్ డ్యాంలో మధ్య సీపేజీ నివారణకి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి.. వచ్చే నెల నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలన.. రేపు రాజమండ్రిలో జలవనరుల శాఖ, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష..

* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి ఆంధ్ర మైసూర్ గా పేరుగాంచిన రాజమండ్రి దేవిచౌక్ లో బాల త్రిపుర సుందరి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. ఈనెల 13వ తేదీ వరకు జరుగునున్న శరన్నవరాత్రి మహోత్సవాలు.. భారీగా విద్యుత్ దీపాల అలంకరణ

* సాయంత్రం తిరుపతిలో వారాహి సభ.. జ్యోతి రావ్ పూలే సర్కిల్‌లో వారాహి బహిరంగ సభ.. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న సభ.. వారాహి డిక్లరేషన్ ను ప్రజలకు వివరించనున్న పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కల్యాణ్‌ చేపట్టిన సభ

* నంద్యాల: నేటి నుండి శ్రీశైలంలో దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. 9 రోజుల పాటు ఘనంగా దసరా ఉత్సవాలు.. అమ్మవారి యగశాల ప్రవేశంతో దసరా మహోత్సవాలకు శ్రీకారం.. సాయంత్రం శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శమివ్వనున్న భ్రమరాంబికాదేవి.. బృంగివాహనంపై ఆశీనులై పూజలందుకోనున్న ఆదిదంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో కన్నులపండువగా శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం

* తిరుమల: రేపు శ్రీవారికి రాష్ర్ట ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు.. రేపు సాయంత్రం 6:20 కి తిరుమల చేరుకోనున్న చంద్రబాబు.. 7:55కి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టువస్ర్తాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకోనున్న చంద్రబాబు దంపతులు.. 7:55 నుంచి 9:15 వరకు శ్రీవారి ఆలయంలో గడపనున్న చంద్రబాబు.. 2025 వార్షిక సంవత్సరం క్యాలెండర్లును ఆవిష్కరించనున్న చంద్రబాబు.. ఎల్లుండి ఉదయం 7.35 కి 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వకుళామాత వంటశాలను ప్రారంభించనున్న చంద్రబాబు

* తిరుమల: మూడోవరోజు తిరుమలలోనే పవన్ కల్యాణ్‌.. ఇవాళ సాయంత్రం వరకు తిరుమలలోనే పవన్.. నిన్న ప్రాయశ్చిత్త ధీక్ష విరమించిన పవన్.. ఇవాళ సాయంత్రం తిరుపతిలో వారాహి సభలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్‌

* ఏలూరు: నేటి నుంచి 21వ తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత (టెట్) పరీక్షలు.. జిల్లాలో హాజరుకానున్న 5,670 మంది అభ్యర్థులు..

* గుంటూరు: నేడు గుంటూరు జిల్లాలో కేంద్ర మంత్రి పర్యటన.. కలెక్టరేట్‌లో, జాతీయ రహదారుల నిర్మాణ పనులపై, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష… అనంతరం తెనాలిలో పర్యటించనున్న కేంద్ర మంత్రి, ప్రభుత్వ వైద్యశాల, మున్సిపల్ కార్యాలయాలను పరిశీలించనున్న ,కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్…

*కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు స్వామి వారి మూలబృందావనంకు తులసి తుంగ జలంతో అభిషేకం, తులసి అర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతభిషకం వంటి విషేశ పూజలు.. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లదరాయులకు ఉంజలసేవ, బంగారు పల్లకి, గజ వాహనం, నవరత్న స్వర్ణ రథంపై ఉరేగింపు.

* అన్నమయ్య జిల్లా: నేడు రాయచోటి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…

* అనంతపురం: గుంతకల్లు రూరల్ పరిధిలోని కసాపురం ఆంజనేయస్వామి దేవాలయంలో నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు.

* అనంతపురం: నల్లరేగడి భూముల్లో రబీపంటగా పప్పుశనగసాగు.. నేటి నుంచి విత్తన పప్పుశనగకు రిజిస్ట్రేషన్లు.. మండలాల వారీగా విత్తనాలు కేటాయింపులు.

* కడప : నేటి నుంచి ఘనంగా ప్రొద్దుటూరు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.

* అమరావతి: AR డైరీ MD రాజశేఖరన్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ.. లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీ ఫిర్యాదుపై రాజశేఖరన్ పై కేసు నమోదు చేసిన తిరుపతి పోలీసులు.. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రాజశేఖరన్

* శ్రీసత్యసాయి: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లేపాక్షి శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర దేవాలయంలో శ్రీబాలాత్రిపుర సుందరి అలంకారం భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు.

* అనంతపురం : తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి నేడు తాడిపత్రి కి రాక.. స్వాగతం పలికేందుకు గుత్తి బాటసుంకులమ్మ ఆలయం వద్దకు చేరుకోనున్న తెలుగుదేశం పార్టీ, జేసి అభిమానులు.. గుత్తి నుంచి తాడిపత్రి కి వాహన ర్యాలీ తో తాడిపత్రి కి చేరుకోనున్న జేసీ

Show comments