* అమరావతి: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలాసీతారామన్, నితిన్ గడ్కరీ సహా మరికొందరు మంత్రులతో విడివిడిగా సమావేశం కానున్న చంద్రబాబు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, బడ్జెట్‌లో అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై చర్చ
* ఖమ్మం: నేడు సత్తుపల్లిలో వనమహోత్సవంలో పాల్గొననున్న మంత్రులు సీతక్క, తుమ్మల, పొంగులేటి
* సూర్యాపేట జిల్లా: నేడు కోదాడ, హుజూర్‌నగర్ నియోజక వర్గాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనులపై సమీక్షా సమావేశం, కోదాడ లో ముస్లిం కమ్యూనిటీ హాల్ స్థల పరిశీలన.. అనంతగిరిలో తహసీల్దార్, MPDO, పోలీస్ స్టేషన్ భవనాలకు శంఖుస్థాపన సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్షా సమావేశాల్లో పాల్గొననున్న ఉత్తమ్.
* ఏలూరు: నేడు పట్టిసీమ నుంచి నీటి విడుదల చేయనున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. అనంతరం పురుషోత్తమ పట్నం, తాడిపూడిల నుంచి నీటి విడుదల చేయనున్న మంత్రి నిమ్మల..
* ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా ఉన్న 902 ప్రభుత్వ పాఠశాలల్లో ఆడిట్.. ఇవాళ, రేపు పాఠశాలల్లో ఆడిట్ నిర్వహించనున్న అధికారులు..
* నెల్లూరు: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు..
* నెల్లూరు: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం అవుతారు
* చిత్తూరు: నేడు జిల్లా జెడ్పీ స్దాయి సంఘ సమావేశం .. పాల్గొనున్న ఎమ్మెల్యేలు, అధికారులు
* కాకినాడ జిల్లాలో నేడు మూడో రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన.. ఉప్పాడ కొత్తపల్లిలో కోతకి గురవుతున్న తీర ప్రాంతాన్ని పరిశీలించి, మత్స్యకార గ్రామాల ప్రజలతో మాట్లాడనున్న పవన్.. సాయంత్రం పిఠాపురంలో వారాహి కృతజ్ఞత బహిరంగ సభలో పాల్గొనున్న డిప్యూటీ సీఎం
* అనంతపురం : ఈనెల 4 న విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చిన ఐక్య విద్యార్థి సంఘాలు.
* విశాఖ: పూరీ జగన్నాథ్ రతయాత్రం కోసం ప్రత్యేక రైళ్లు.. గునుపూర్, పలాస, వైజాగ్ నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ట్రైన్ లు
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో నట సార్వభౌమ ఎస్వీ రంగారావు 106వ జయంతోత్సవం.. ఉదయం 9 గంటల నుంచి గోదావరి గట్టున ఉన్న ఎస్వీ రంగారావు విగ్రహం వద్ద జయంతోత్సవాలు.. ఎస్వీ రంగారావు కల్చరల్ అసోసియేషన్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్టు సభ్యులు, చిరంజీవి అభిమానులు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఎస్వీ రంగారావు జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్.. అనంతరం సమిశ్రగూడెం Z.P హైస్కూల్లో స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. విజ్జేశ్వరం గ్రామంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. కొండగుంటూరు గ్రామంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజానగరం నియోజకవర్గంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు విడుదల చేయనున్నా మంత్రి
* తూర్పుగోదావరి: నేడు రాజమండ్రిలో సిటీ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో జరుగునున్న వైసీపీ సమావేశం
* అనంతపురం : ఈనెల 4న కర్నాటక – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అటవీ , మ్తెనింగ్ లీజుల విభజన ప్రక్రియప్తె క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న అధికారులు.
* అనంతపురం : కళ్యాణదుర్గం పట్టణంలోని మార్కెట్ యార్డు నందు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్
* తూర్పుగోదావరి జిల్లా: రేపు విద్యా సంస్థలు బంద్.. నీట్ పరీక్ష లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని. డిమాండ్
* విజయవాడ: రాజీనామా చేసిన వాలంటీర్ల అధ్వర్యంలో నేడు ఛలో విజయవాడ.. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రధాన డిమాండ్.. కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ రావద్దని ఇప్పటికే చెప్పిన పోలీసులు
* తిరుమల: 8 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,398 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,512 మంది భక్తులు.. హుండీ ఆదాయం 4.09 కోట్లు