NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం.. అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్షన్నర రూపాయల రుణమాఫీ చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రెండో విడతలో సుమారు 7వేల కోట్ల రుణమాఫీ చేయనున్న ప్రభుత్వం

* మళ్లీ భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ… భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులు.. 9,18,164 క్యూసెక్కుల ప్రవాహం.. గత రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

* ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో పలు ఆరోపణల నేపథ్యంలో డ్వామా పీడీ అర్జునరావును విచారణ చేయనున్న జాయింట్ కలెక్టర్ గోపాల కృష్ణ..

* ప్రకాశం: దర్శి వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలతో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సమీక్షా సమావేశం..

* ప్రకాశం: కోమరోలు మండలం సూరవారిపల్లిలో పీర్ల పండగ సంధర్బంగా రాష్ట్ర స్థాయి ఎద్దుల బండ లాగుడు పోటీలు..

* బాపట్ల : కారంచేడులో ఆడి కృతిక సందర్భంగా 100 మహిళలచే సుబ్రహ్మణ్యం స్వామికి కావడి సేవ కార్యక్రమం..

* తిరుమల: ఆగస్టు 14వ తేదీన శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ.. 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మూడు రోజులు పాటు వార్షిక పవిత్రోత్సవాలు

* నెల్లూరు జిల్లా: పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించనున్న కలెక్టర్ ఆనంద్

* విజయనగరం: జోన్నాడ వద్ద ఏర్పాటు చేసిన టోన్ ప్లాజాను తొలగించాలని నేడు మహాధర్నా.. అన్ని సంఘాలు పాల్గొనాలని కోరిన లోక్ సత్త అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ..

* అనంతపురం : గుంతకల్ మండలం వ్తెటీ చెరువు, సేవాగడ్ గ్రామాలలో పర్యటించనున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.

* అనంతపురం : గుత్తి మున్సిపాలిటీలో సాధరణ కౌన్సిల్ సమావేశం

* అనంతపురం : పాత గుంతకల్లు లో వెలిసిన హాజరత్ మస్తాన్ వలి ఉరుసు ఉత్సవాలు ప్రారంభం.

* అనంతపురం : ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్న ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.

* తూర్పుగోదావరి జిల్లా: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ.. బ్యారేజ్ నుండి 13 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల.. బ్యారేజీ వద్ద ప్రస్తుతం కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

* శ్రీ సత్యసాయి : ముదిగుబ్బ మండల కేంద్రంలో పర్యటించనున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్.

* పార్వతీపురం మన్యం జిల్లా: పాచిపెంట పెద్దగడ్డ జలాశయం నుంచి నేడి నీటిని విడుదల చేయనున్న మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి

* కర్నూలు: సుంకేసుల జలాశయంకు భారీగా కొనసాగుతున్న వరద నీటి ప్రవాహం.. ఇన్ ఫ్లో 1,60,200 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 1,58,142 క్యూసెక్కులు.. 28 గేట్ల ఎత్తివేత..

* తిరుపతి: నేడు కోదండరామస్వామ ఆలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ

* తిరుమల: 12 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,874 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,782 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.48 కోట్లు

* శ్రీశైలం జలాశయం 3 గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కు నీరు విడుదల.. ఇన్ ఫ్లో 4,60,040 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో : 1,41,560 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 880.90 అడుగులు.. కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* నాగార్జున సాగర్ ప్రాజెక్టు అప్ డేట్.. ఇన్ ఫ్లో 77,695 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 29,973క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు.. ప్రస్తుత నీటి మట్టం 514.60 అడుగులు..

* నిర్మల్: కడెం ప్రాజెక్టుకు పెరుగుతున్న నీటి మట్టం.. కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. ఒక్క గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల.. నీటి మట్టం 695.275/700 Ft in.. నీటి సామర్థ్యం 6.426/7.603 TMC.. ఇన్ ఫ్లో: 4426 C/s.. ఔట్ ఫ్లో:4324 C/s