NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఢిల్లీ: రాష్ట్రపతి అధ్యక్షతన ఇవాళ గవర్నర్ల సదస్సు.. హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు , అన్ని రాష్ట్రాల గవర్నర్లు.. దేశంలోని పలు కీలక అంశాలపై రెండు రోజులపాటు జరగనున్న చర్చలు .. నూతన నేర, న్యాయ చట్టాలు, ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీల అక్రిడేషన్, గిరిజన ప్రాంతాల అభివృద్ధి , వెనుకబడిన జిల్లాలు- సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి లో గవర్నర్ల పాత్ర పై చర్చ

* అమరావతి : నేడు మున్సిపల్‌ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. సాయంత్రం మంత్రి నారాయణ, ఉన్నతాధికారులతో సమావేశం.. శాఖాపరంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే అవకాశం

* హైదరాబాద్‌: నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. ధరణిపై స్వల్పకాలిక చర్చ.. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చ.. జాబ్ క్యాలెండర్ ప్రకటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

* హైదరాబాద్‌: ఉపాధ్యాయులతో సీఎం సభ.. నేడు ఎల్బీ స్టేడియంలో పదోన్నతి పొందిన 30 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ

* నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నేడు సాగునీటిని విడుదల.. మధ్యాహ్నం తర్వాత హెలికాప్టర్ లో నాగార్జునసాగర్ కు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటరీ నుండి 4 వేల క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేయనున్న మంత్రులు..

* అమరావతి: నేడు బెంగుళూరు వెళ్లనున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌.. మధ్యాహ్నం 4 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి గన్నవరం చేరుకోనున్న జగన్.. సాయంత్రం 7 గంటలకు బెంగుళూరులో నివాసానికి చేరుకోనున్న వైఎస్‌ జగన్

* ఇవాళ అమరావతికి రానున్న ఐఐటీ నిపుణులు.. గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యాన్ని అధ్యయనం చేయనున్న ఇంజినీర్లు.. రెండు రోజులపాటు రాజధానిలో కట్టడాల పరిశీలన చేయనున్న నిపుణులు.. 2019కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే పనులు నిలిచిపోయిన భవనాలను పరిశీలించనున్న ఐఐటీ బృందం. ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించిన సర్కార్.

* అమరావతి: ఇవాళ సాయంత్రం సీఆర్డీయే అథార్టీ సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అథార్టీ భేటీ. రాజధాని నిర్మాణం, పనుల పురోగతిపై చర్చ. రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొచ్చే కంపెనీల విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్. రాజధాని పరిధిలో భూములిచ్చిన కొన్ని సంస్థలకు తమ కార్యాలయాల ఏర్పాటుకు గడువు పొడిగించే అంశంపై చర్చ.

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి… రాష్ట్ర మౌలిక సదుపాయాలు.. పెట్టుబడులు.. రహదారులు భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్దన్ రెడ్డి తో కలిసి జువ్వలదిన్నె హార్బర్… రామాయపట్నం పోర్టును సందర్శిస్తారు

* నెల్లూరు : కందుకూరు నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టును పరిశీలించనున్న మంత్రులు బిసి జనార్దన్‌రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మారిటైం బోర్డు సీఈవో సీవీ ప్రవీణ ఆదిత్య..

* అనంతపురం : ఆంధ్రప్రదేశ్ త్తెక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రస్థాయి పోటీలు.

* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. జలాశయం 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల.. ఇన్ ఫ్లో 4,65,261 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 4,91,602 క్యూసెక్కులు.. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 883.80 అడుగులు.. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా పెరుగుతున్న వరద ప్రవాహం.. ఇన్ ఫ్లో 3,27,949 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 30,747 క్యూసెక్కులు. ప్రస్తుత నీటిమట్టం 545.60 అడుగులు.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు.

* నేడు శ్రీశైలంలో శుక్రవారం సందర్భంగా శ్రీభ్రమరాంబికాదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామి అమ్మవారి ఊయలసేవ, ప్రత్యేక పూజలు

* తిరుమల: 18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులుకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,465 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,206 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ. 3.66 కోట్లు

* తూర్పు గోదావరి జిల్లా: నేటి నుండి జిల్లా వ్యాప్తంగా సదరం క్యాంపులు ఏర్పాట్లు.. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మంగళ శుక్ర వారాల్లో 5 రకములు సదరం సర్టిఫికేట్ జారీ.. ముందుగా గ్రామ సచివాలయాల్లో పరీక్షలకి స్లాట్ నమోదు చేసుకోవాలి.. ప్రతీ సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ రోజున ఆరోగ్య సంబంధ పింఛన్లకు సంబంధించిన ఆర్జిల స్వీకరణ- కలక్టర్ పి. ప్రశాంతి