* నేటి నుంచి మేడారం మహా జాతర కీలక ఘట్టం.. ఇవాళ చిలకలగుట్ట నుంచి మేడారం రానున్న సమ్మక్క తల్లి..
* నేడు సీఎం చంద్రబాబు పర్యటన రద్దు.. అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్గొననున్న మంత్రి లోకేష్.. మధ్యాహ్నం 2: 15 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. పలు శాఖలపై సమీక్షలు నిర్వహించనున్న చంద్రబాబు..
* నేటి నుంచి విశాఖలో మూడు రోజుల పాటు పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. స్థానిక కార్యక్రమాలతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న పవన్..
* నేడు అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన.. రేపటి నుంచి ప్రారంభం కానున్న అనకాపల్లి ఉత్సవ్ ఏర్పాట్లు పరిశీలించనున్న హోం మంత్రి.. కొండకర్ల ఆవ, ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం..
* నేడు విశాఖలో గీతం భూములను పరిశీలించనున్న వైసీపీ నేతలు.. రేపు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ నిరసన.. విశాఖలో భూ దోపిడి జరుగుతుందని వైసీపీ ఆరోపణలు..
* నేడు గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల లడ్డు కల్తీ నిజం -దేవాలయాల శుద్ధి కార్యక్రమం, పాల్గొనున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు..
* నేడు మున్సిపల్ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించనున్న టీ. బీజేపీ.. సాయంత్రం అభ్యర్థులను ప్రకటించనున్న టీ.బీజేపీ..
* నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 15 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం..
* నేడు మధ్యాహ్నం రెండు గంటలకు అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి రథయాత్ర.. రథోత్సవానికి పటిష్టమైన ఏర్పాట్లు.. కళ్యాణ దివ్యమూర్తులను రథంపై కొలువు తీర్చిన భక్తజనం నడుమ వైభవంగా ఊరేగించడం అంతర్వేది క్షేత్రంలో ఆనవాయితీ.. ఉత్సవాల ఆరంభం రోజునే అంతర్వేది మెరక వీధిలో సిద్ధం చేసిన రథాన్ని పుష్పాలంకరణ, భక్తులు సమర్పించిన అరటి గెలలతో తీర్చిదిద్దిన ఆలయ అధికారులు.. నేడు మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాలకు రథయాత్ర ప్రారంభం..
* నేడు పార్లమెంట్ ముందుకు 2025-26 ఆర్థిక సర్వే.. ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్.. ప్రపంచంలోనే 4వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. మధ్యాహ్నం 2: 30కి చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ మీడియా సమావేశం.. ఆర్థిక సర్వే నివేదికను వివరించనున్న అనంత నాగేశ్వరన్..
* నేడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భౌతికకాయానికి అంత్యక్రియలు.. ఉదయం 11 గంటలకి బారామతిలోని విద్య ప్రతిష్ఠాన్ ప్రాంగణంలో అజిత్ పవార్ అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్ అంత్యక్రియలు.. అంత్యక్రియల్లో పాల్గొననున్న మోడీ, అమిత్ షా, నితిన్ నబీన్, ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండే.. 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం..
