* మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నేటి పర్యటన వివరాలు.. ఉదయం 10 మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 5 గంటలకు తూర్పు నాయుడుపాలెం I.O.C దామచర్ల సత్య కార్యాలయంలో జరిగే కొండపి నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.
* ప్రకాశం : గిద్దలూరులో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా..
* ప్రకాశం : వెలిగొండ ప్రాజెక్టు పరిశీలన కోసం జిల్లాలో పర్యటించనున్న మంత్రి నిమ్మల రామానాయుడు.. వెలిగొండ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఇవాళ రాత్రికి దోర్నాల చేరుకోనున్న మంత్రి రామానాయుడు.. రేపు జిల్లా నాయకులతో భేటీ అనంతరం ప్రాజెక్టు సందర్శన.. వెలిగొండ ప్రాజెక్టు పెండింగ్ పనులు, మార్కాపురం మండలం గొట్టిపడియ డ్యాం పరిశీలన..
* తిరుమల: 31వ తేదిన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.. ఈ సందర్భంగా ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. 30వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనంతసాగరం మండల కేంద్రంలో జరిగే గ్రీవెన్స్ డే లో పాల్గొంటారు
* విశాఖ: ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రెండు రోజులు పర్యటన… ఇంచార్జ్ మంత్రిగా అనకాపల్లి జిల్లాలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి.. కూటమి పార్టీలతో విస్తృత స్థాయి సమావేశం.. కసింకోట (మం) సుందరయ్య పేటలోని విశాఖ డిస్టలరీ పరిశీలన.. కలెక్టరేట్ లో DRC సమావేశంలో పాల్గొననున్న కొల్లు రవీంద్ర
* విశాఖ: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రెండు రోజుల పర్యటన… రేపు VMRDA ఏరీనాలో జరగనున్న రోజ్ గార్ మేళాకు ముఖ్య అతిథిగా బండి సంజయ్..
* అనంతపురం : గుంతకల్లులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. రెవెన్యూ డివిజన్ కు సంబంధించి గుంతకల్లు టిటిడి కళ్యాణ మండపంలో పిజిఆర్ఎస్ కార్యక్రమం నిర్వహణ.
* ప్రకాశం : ఒంగోలు 12 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈవీఎం లలో అవకతవక జరిగాయంటూ మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన పిల్ పై ఇవాళ తుది తీర్పు ఇవ్వనున్న హైకోర్టు..
* గుంటూరులో నేడు మంత్రి కందుల దుర్గేష్ పర్యటన.. సాయంత్రం 04:00 గంటలకు గుంటూరులోని “డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ” మీటింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు.
* తూర్పు గోదావరి జిల్లా: పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ జారీ.. నేటి నుంచి నవంబరు 11లోపు ఫీజు చెల్లించడానికి గడువు.. .12వ తేదీ నుంచి నవంబరు 18వరకు చెల్లిస్తే రూ.50, 19 నుంచి 25 వరకు రూ.200, 26నుంచి నవంబరు 30 వరకు రూ.500 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
* తూర్పు గోదావరి జిల్లా: రేపటి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభం.. ఈ నెల 29 ఉదయం 10 గంటల నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు.
* ప.గో.: పాలకొల్లు ఉదయం 11 గంటలకు నియోజక వర్గస్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశం.. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు నమోదు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటింగ్ నమోదు తదితర అంశాలపై సమావేశం చర్చ.
* శ్రీ సత్యసాయి : పెనుకొండలో ప్రజాదర్భార్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి సవిత.
* విజయవాడ పర్యటనలో మంత్రులు పయ్యావుల కేశవ్ , సత్యకుమార్.
* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. ఇన్ ఫ్లో 51,644 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 67,583 క్యూసెక్కులు.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
* నేడు శ్రీశైలంలో సోమవారం వారాంతపు సేవలలో భాగంగా శ్రీస్వామి అమ్మవారికి ఆలయంలో వెండి రధోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ
* నంద్యాల: మహానంది క్షేత్రంలో సోమవారం సందర్భంగా నేడు స్వామివారికి ప్రత్యేక అభిషేకార్చనలు, సాయంత్రం పల్లకి సేవ
* నంద్యాల: కలెక్టరేట్ లో నేడు ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్న కలెక్టర్
* నంద్యాల: బనగానపల్లె (మం) యాగంటి ఉమా మహేశ్వర స్వామి క్షేత్రంలో నేడు ప్రత్యేక పూజలు, బిల్వార్చన, స్వామి అమ్మవార్ల కు మహా మంగళహారతి