NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* కోల్‌కతా: నేడు పశ్చిమ బెంగాల్‌ బంద్‌కు బీజేపీ పిలుపు.. మంగళవారం సచివాలయం దగ్గర జూనియర్‌ డాక్టర్లు, విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వ తీరుకు నిరసనగా 12 గంటల పాటు బంద్‌కు పిలుపు

* అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ. పేపర్ లెస్ విధానాన్ని అవలంభిస్తూ ఈ-కేబినెట్ నిర్వహిస్తున్న ప్రభుత్వం. 2014-19 మధ్య కాలంలో నిర్వహించిన ఈ-కెబినెట్ విధానాన్ని.. మళ్లీ అమల్లో పెట్టిన కూటమి ప్రభుత్వం. కేబినెట్ భేటీలో కీలకాంశాలపై చర్చ.

* హైదరాబాద్‌: నేడు డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ.. పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..

* హైదరాబాద్‌: ఈ రోజు మధ్యామ్నం 12.30 గంటలకు రీజినల్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ పై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష సమావేశం

* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవం.. సాయంత్రం 4 గంటలకు మాడవీధులలో ఉరేగునున్న శ్రీకృష్ణ స్వామివారు.. ఈ నేపథ్యంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ.

* విశాఖ: నేడు నగరానికి విద్యాశాఖ మంత్రి లోకేష్… రెండు రోజులపాటు విశాఖలో పర్యటన..

* అనంతపురం : నేడు తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం.

* ఏలూరు.: పోలవరం వద్ద స్వల్పంగా పెరిగిన గోదావరి నీటి మట్టం.. ప్రాజెక్టు స్పిల్ వే వద్ద 29.54 మీటర్ల నీటిమట్టం.. 4,09,673 కూసెక్కుల నీరు దిగువకు విడుదల..

* నేడు బెజవాడ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం.. ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి, ఒకరు బీజేపీలోకి చేరిన తర్వాత జరుగుతున్న కౌన్సిల్ సమావేశం.

* పశ్చిమ గోదావరి: నేడు నరసాపురం మాధవాయపాలెం రేవు పాట.. ప్రారంభ ధర 2.97కోట్లు.. నరసాపురం -సఖినేటి పల్లి మధ్య గోదావరి పై పంటు నడిపేందుకు పాట నిర్వహించనున్న అధికారులు

* గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సమస్యలను, పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షలు..

* గుంటూరు: మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ముఖద్వారాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి నారా లోకేష్ …

* గుంటూరు: నేడు దుగ్గిరాలలో 42 అడుగుల అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు …

* గుంటూరు: నేడు తెనాలి వైకుంటపురంలో వివిధ దేవతా మూర్తుల నూతన విగ్రహాల ప్రతిష్ట..

* తిరుమల: 14 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న71,153 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,863 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.32 కోట్లు

Show comments