NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* ఢిల్లీ: నేడు నీతి ఆయోగ్ సమావేశం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ జరిగే నీతి అయోగ్ సమావేశంలో చర్చ

* ఢిల్లీ: నేడు రాష్ట్రపతి భవన్ లో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు.. సమావేశానికి దూరంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కేరళ ముఖ్యమంత్రులు.. సమావేశంలో పాల్గొననున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. సమావేశంలో నిరసన తెలియజేస్తాను అంటున్న మమతా బెనర్జీ

* హైదరాబాద్‌: నేడు అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ.. ప్రశ్నోత్తరాలు రద్దు.. బడ్జెట్ పై చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు రిప్లై ఇవ్వనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

* కాకినాడ: నేడు, రేపు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్న పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ కృష్ణ తేజ.. నేడు గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్న కృష్ణ తేజ.. రేపు జిల్లా స్థాయి అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ పనులపై సమీక్ష సమావేశం

* అనంతపురం : గుంతకల్ పురపాలక సంఘంలో సాధారణ కౌన్సిల్ సమావేశం.

* నెల్లూరు నగరపాలక సంస్థలలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న కమిషనర్ సూర్య తేజ

* ఏలూరు జిల్లా ముంపు మండలాల్లో మంత్రుల పర్యటన.. వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లోని ముంపు గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలించనున్న మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పార్థసారథి

* భద్రాచలంలో మళ్లీ పెరుగుతూ, తగ్గుతున్న గోదావరి వరద ఉధృతి.. 50 పాయింట్ 2 అడుగులు వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం.. భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద స్వల్పంగా తగ్గుతున్న గోదావరి వరద ప్రవాహం.. రెండు రోజులుగా రెండో ప్రమాద హెచ్చరికకు చేరువగా గోదావరి వరద ప్రవాహం

* ఏలూరు: పోలవరం ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి.. స్పిల్ వే వద్ద 33.1 మీటర్ల నీటిమట్టం.. ప్రాజెక్టు 48 గేట్ల నుంచి 11 లక్షల 2 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల..

* విశాఖ: నేడు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి మీటింగ్ పై ఉత్కంఠ.. వైసీపీ పాలనలో వున్న జెడ్పీ పీఠం… చైర్ పర్సన్ శుభద్రపై అసంతృప్తిగా వున్న వైసిపి జెడ్పీటీసీలు…!

* శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు.. ఇన్ ఫ్లో 2,60,637 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 57,654 క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 861.70 అడుగులు.. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* కర్నూలు: సుంకేసుల జలాశయం నుంచి 20 గేట్ల ద్వారా నీరు విడుదల

* తుంగభద్రలో భారీగా పెరిగిన వరద నీటి ప్రవాహం.. ఇన్ ఫ్లో 82,300 క్యూసెక్కులు.. ఔట్‌ ఫ్లో 73,680 క్యూసెక్కులు.. 20 గేట్ల ఎత్తివేత

* నంద్యాల: నేడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటి విడుదల.. ఉదయం 10:30 గంటలకు అధికారులతో కలిసి నీటిని విడుదల చేయనున్న ఎమ్మెల్యే గిత్త జయసూర్య..

* అనంతపురం : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జీపు జాత కార్యక్రమం.

* ప్రకాశం : కొమరోలు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి 100 రకాల కూరగాయలు పండ్లు ఆకుకూరలతో అలంకరణ… శాకంబరిగా భక్తులకు దర్శనమిస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు… అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి భారీగా తరలివస్తున్న భక్తులు…

* తిరుమల: ఇవాళ టీటీడీ అడిషనల్ ఈవోగా భాధ్యతలు స్వీకరించనున్న వెంకయ్య చౌదరి

* తిరుమల: 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,980 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 27,441 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.21 కోట్లు

* నంద్యాల : శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్.. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ఈవో పెద్దిరాజు.. శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్

* నేడు మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రి రాందాస్ అథావలె పర్యటన.. మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో కేంద్ర బడ్జెట్ పై ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించనున్న కేంద్ర మంత్రి