NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* కోల్‌కతాలో జూనియర్‌ డాక్టర్‌ ఘటనకు నిరసనగా నేడు పశ్చిమ బెంగాల్‌ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన జూనియర్‌ డాక్టర్లు

* ఢిల్లీ: సుప్రీం కోర్టులో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ.. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత

* ఆదిలాబాద్‌: నేడు ఏజెన్సీ బంద్‌కు పిలుపు నిచ్చిన తుడుం దెబ్బ.. వలస లంబాడీ లను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి. GO MS నంబర్ 3ని యధావిధిగా కొనసాగించాలి. TSPA (ట్రైబల్ సబ్ ప్లాన్ ఏరియాలను) ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలి. 40% ఆదివాసీలు ఉన్న గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తిస్తూ, ఏజెన్సీ ప్రత్యేక DSC లో అవకాశం కల్పించాలి. 29 శాఖలో ఉన్న GO లను చట్టంగా చేయాలి. ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు మంజూరు చేసి గిరి వికాసం ద్వారా బోరు బావులు మంజూరు చేయాలని డిమాండ్‌.

* యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకోనున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గవర్నర్ టూర్ నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు . గవర్నర్ రాక సందర్భంగా ఆలయ బ్రేక్ దర్శనంలో స్వల్ప మార్పులు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఉండాల్సిన బ్రేక్ దర్శనం 10 నుండి 11 గంటలకు మార్పు చేసిన ఆలయ అధికారులు.

* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి వేడుకలు.. రాత్రికి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం.. రేపు మాడవీధులలో ఉట్లోత్సవం.. సాయంత్రం 4 గంటలకు మాడవీధులలో ఉరేగునున్న శ్రీకృష్ణ స్వామి వారు.. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసిన టీటీడీ.

* నెల్లూరు జిల్లా: వచ్చే నెల 6న రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. చిల్లకూరు మండలం తమ్మినపట్నం వద్ద కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ కు శంకుస్థాపన, పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. కేంద్ర, రాష్ట్ర మంత్రులు.. ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం అందడంతో ఏర్పాట్లలో అధికారులు

* విశాఖపట్నం: నేడు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పర్యటన.. ఉదయం 7.30 కి కాపులుప్పాడ లో చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ పరిశీలన.. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ వీఎంఆర్డీఎ,VK-PCR పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలవరకూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష.. మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 వరకూ స్టానికి ఎంపీ, ఎంఎల్ఏ లతో సమావేశం

* అనంతపురం : పెద్ద వడుగూరు మండలం కొండుపల్లి గ్రామంలో త్రిశక్తి మైన్స్ అండ్ మినరల్స్ ప్రజాభిప్రాయ సేకరణ

* శ్రీ సత్యసాయి : పెనుకొండలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి సవితమ్మ

* పల్నాడు: నేడు నరసరావుపేటలో పల్నాడు ఎస్పీని కలవనున్న టీడీపీనేత బుద్దా వెంకన్న.. వైసీపీ ప్రభుత్వంలో మాచర్లలో తన పై దాడి చేసి, హత్యాయత్నం చేసారని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , మరియు పిన్నెల్లి అనుచరుడు తురకా కిషోర్ పై చర్య తీసుకోవాలని పల్నాడు ఎస్పీని కలవనున్న వెంకన్న..

* విశాఖ: నగరంలో సూపర్ స్టార్ రజనీకాంత్.. ఫిషింగ్ హార్బర్ లో సినిమా షూటింగ్…

* శ్రీకాకుళం: నేటి నుంచి జిల్లాలో రెండు కొత్త ఇసుక స్టాక్ పాయింట్లు. గార మండలం , శాలిహుండం. బూర్జ మండలం , ఖండ్యం వద్ద కొత్తగా రెండు ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు-జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్

* తిరుపతి: నేడు కాణిపాకం బ్రహ్మోత్సవాలపై సమీక్ష… సెప్టెంబరు 7 నుండి 27 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు

* తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,910 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 30,320 మంది భక్తులు.. హుండీ ఆదాయం 4.26 కోట్లు

* విజయనగరం: నేడు కూడా నెల్లిమర్లలో భద్రపరిచిన ఈవీఎంల తనిఖీ కొనసాగింపు… విజయనగరం లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఈవీఎంల తనిఖీ.. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు తనిఖీలు కొనసాగింపు..

* విజయవాడ: నేడు నరసరావుపేట ఎస్పీకి పిన్నెల్లి పై ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న.. వైసీపీ హయంలో తమపై హత్యాయత్నం జరిగినా కేసు నమోదు చేయలేదని ఈ కేసు మళ్ళీ విచారణ చేయాలని ఎస్పీ నీ కోరనున్న బుద్ధా

* విశాఖ: నేడు సింహాచలం దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలు.. సాయంత్రం 6 గంటల వరకే లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు

* ఏలూరు: నేడు టీడీపీలో చేరనున్న ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త కో ఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నారా లోకేష్ సమక్షంలో టిడిపీ కండువా కప్పుకోనున్న మేయర్ దంపతులు..

* పల్నాడు: సత్తెనపల్లిలో టిడ్కో గృహాల విద్యుత్ పనులకు శంకుస్థాపన చేయనున్న, శాసన సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ…

* అమరావతి: కోనో కార్పస్ చెట్లను, మొక్కలను అకారణంగా కొట్టేయకుండా అడ్డుకోవాలని ఏపీ హైకోర్టులో పిల్ వేసిన జన చైతన్య వేదిక

* విజయవాడ: నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి (అనపర్తి శాసన సభ్యులు) ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ప్రజల సమస్యలపై ఆర్జీలు స్వీకరించి పరిష్కరించే “బి.జె.పి వారధి” కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు.

Show comments