Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నేడు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్.. ఉదయం 11 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన సమావేశం.. ఈ సమావేశానికి హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు..
నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఉదయం 9 గంటలకు రిపబ్లిక్‌ డే వేడుకలలో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్‌, సీఎం జగన్..
నేడు గుంటూరులో పర్యటించనున్న పీసీసీ చీఫ్ షర్మిల.. గుంటూరు ఆటోనగర్ నుండి శ్యామల నగర్ గేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్న కాంగ్రెస్ శ్రేణులు.. అనంతరం మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో, ఉమ్మడి గుంటూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్న షర్మిల..
తూర్పుగోదావరి జిల్లాలో నేటితో ముగియనున్న భువనేశ్వరీ మూడు రోజుల పర్యాటన.. ఈ సాయంత్రం రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి హైదరాబాద్ కు పయనం..
నేడు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.. అనంతరం వెంకటాచలం మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేడు మదనపల్లెలో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన.. నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో సమావేశం.. మదనపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ నిసార్అహ్మద్ అధ్యక్షతన జరగనున్న సమావేశం.
నేడు ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న కలెక్టర్ దినేష్ కుమార్, హాజరుకానున్న మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి..
నేడు ఒంగోలు వైసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు, హాజరుకానున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..
నేడు గిద్దలూరు లోని పాతాళ నాగేశ్వరస్వామి ఆలయంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం..
నేడు కొండేపిలో టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో విసృత స్దాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే స్వామి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య..
నేడు తాళ్లూరు మండలం గుంటి గంగ వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొననున్న దర్శి వైసీపీ ఇంచార్జీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అనంతరం రజానగరంలో మన ఊరికి మన శివన్న ప్రచార కార్యక్రమం..
నేడు తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి తానేటి వనిత పర్యటన..
నేడు హైదరాబాద్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య కొనసాగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్..

Exit mobile version