నేడు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం.. మధ్యాహ్నం 3గంటలకు ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు భేటీ..
నేడు రాయచోటి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పర్యటించి వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
నేడు విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ (IMA), 2వ అంతస్తు ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నేడు విజయనగరం జిల్లాలో కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పర్యటన..
నేటి నుంచి ఏలూరులో ఆగనున్న వందే భారత్ రైల్.. విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లనున్న వందే భారత్ రైలు నేటి నుంచి సాయంత్రం 5: 54 నిమిషాలకు ఏలూరులో హాల్ట్.. సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లే సమయంలో ఉదయం 9: 49కి ఏలూరు రైల్వే స్టేషన్ లో ఆగనున్నాయి.
నేడు తెలంగాణకు వర్ష సూచన.. తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు.. 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం..
నేటి నుంచి మూడు రోజుల పాటు తిరుపతి ఇస్కాన్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు..
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday