NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

నేడు నూతన కోర్టు భవనాలు ఆరంభం కానున్నాయి. ముఖ్య అతిథిగా హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ధరజ్ సింగ్ పాల్గొననున్నారు. పలువురు న్యాయమూర్తులు కూడా పాల్గొననున్నారు.

నేడు విశాఖలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ పర్యటించనున్నారు. పోర్ట్ సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో సమవావేశాని హాజరుకానున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాలలో నేడు ఏడోవ రోజు. ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంపై భక్తులకు మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై భక్తులుకు స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారంతో ముగియనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

నేడు హిందూపురంలో వినాయక నిమజ్జనం జరగనుంది. పట్టణంలోని 300 విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. శోభయాత్ర జరిగే ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమ్తెన బందోబస్త్ ఏర్పాటు చేశారు.

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు! తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?

నారా చంద్రబాబు రిమాండ్, పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. సీఐడీ కస్టడీ ముగిసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆన్ లైన్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు చంద్రబాబును అధికారులు హాజరు పరచనున్నారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపుపై నేటి సాయంత్రమే ఏసీబీ జడ్జ్ నిర్ణయం తీసుకోనున్నారు.

నేటి నుంచి కర్నూలు మీదుగా కాచిగూడ- బెంగళూరు-కాచిగూడ వందే భారత్ రైలు ఆరంభం. బుధవారం మినహా మిగతా అన్ని రోజుల్లో రైలు ప్రయాణించనుంది. నేడు సాయంత్రం 4.17 కర్నూలు చేరుకోనున్న వందే భారత్ రైలు. రేపటి నుంచి బెంగుళూరు వెళ్లే రైలు ఉదయం 8.39, కాచిగూడ వెళ్లే రైలు రాత్రి 7.50కి కర్నూలు స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.