NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday

Whatstoday

*నేటి నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు.. రేపటి నుంచి తెలంగాణ శాసనమండలి సమావేశం.. 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ సర్కార్.

*అమరావతి: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. ప్రశ్నోత్తరాలు, కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ వర్సిటీ పేరు మార్పు బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం.. గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై రేపుఅసెంబ్లీలో చర్చ.. ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్న సీఎం చంద్రబాబు.. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్న మంత్రులు.

*నేడు ఢిల్లీకి జగన్‌, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. రేపు ఢిల్లీలో జరిగే ధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్.. 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండేలా మాజీ సీఎం జగన్ షెడ్యూల్.

*అంబేద్కర్ కోనసీమ: నేడు గోదావరి వరదలు కారణంగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు.. ఈ మేరకు విద్యా శాఖ అధికారులతో అన్ని విద్యా సంస్థలకు సర్క్యులర్స్ జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌ కుమార్

*తూర్పుగోదావరి జిల్లా: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ.. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వస్తున్న వరదనీరు.. బ్యారేజ్ వద్ద 13.75 అడుగులకు చేరుకున్న నీటిమట్టం.. బ్యారేజ్ నుండి 13 లక్షల 261 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల

*తిరుమల: ఇవాళ ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు దర్శన టికెట్లు విడుదల.. రేపు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లు విడుదల.

*ఢిల్లీ: ఇవాళ ఉదయం 10.15 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం.. కేబినెట్ భేటీ తర్వాత ప్రధాని మోడీతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం.. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. వరుసగా 7వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డ్ సృష్టించనున్న నిర్మల.

*ఢిల్లీ: ఇవాళ ఉదయం 10.30 గంటలకు కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుల సమావేశం.. ఇవాళ సాయంత్రం ఖర్గే నివాసంలో ఇండియా కూటమి ఫ్రోర్ లీడర్ల భేటీ.

*ఢిల్లీ: నీట్ అవకతవకలపై నేడు మరోసారి సుప్రీంకోర్టు విచారణ.. కొన్ని ప్రశ్నలపై తలెత్తిన గందరగోళంపై సమాధానాల కోసం కమిటీ వేయాలని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌కు సుప్రీం ఆదేశం.

*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,840.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,690.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.95,900.