Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today New

Whats Today New

* టీ20 వరల్డ్‌ కప్‌: రాత్రి 8 గంటలకు బంగ్లాదేశ్‌తో భారత్‌ సూపర్‌-8 పోరు

* అమరావతి: ఇవాళ రెండో రోజు ఉదయం పదిన్నరకు ప్రారంభం కానున్న అసెంబ్లీ. నిన్న ప్రమాణం చేయని వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించనున్న ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ప్రకటించనున్న బుచ్చయ్య చౌదరి. కొత్త స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న అయ్యన్నపాత్రుడు. సభాపతి ఎన్నిక ప్రకటన.. అయ్యన్నను గౌరవప్రదంగా స్పీకర్‌ చైర్‌లో కుర్చొపెట్టనున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉండాలని జగన్ నిర్ణయం.

* కడప: నేడు పులివెందులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎన్నికల అనంతరం మొట్టమొదటిసారిగా పులివెందులకు జగన్.. భవిష్యత్ కార్యాచరణ పైన పులివెందుల నాయకులతో భేటీ అయ్యే అవకాశం.

* అమరావతి: సాయంత్రం 4 గంటలకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో సమావేశం.. హాజరుకానున్న 16 మంది టీడీపీ లోక్‌సభ సభ్యులు.. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతను ఎంపిక చేయనున్న చంద్రబాబు.

* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

* తిరుమల: ఇవాళ ఆన్ లైన్ లో సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.

* హైదరాబాద్‌: ఈరోజు సెక్రటేరియట్ లో ఉదయం 11.00 గంటలకు ఎకో టూరిజం పాలసీపై అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించనున్న మంత్రి కొండా సురేఖ

* ప్రకాశం : కొండేపి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డోల బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిలకు నేడు టంగుటూరు టీడీపీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం..

* అమరావతి: నేడు విద్యుత్ శాఖ మంత్రిగా మధ్యాహ్నం 12.20 నిమిషాలకు భాద్యతలు చేపట్టనున్న గొట్టిపాటి రవికుమార్

* ప్రకాశం : ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన దామచర్ల జనార్ధన్ కు కూటమి పార్టీ నేతల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ..

* ప్రకాశం: మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో నేడు స్వామి వారి కళ్యాణోత్సవం..

* నెల్లూరు జిల్లా: నేడు మాజీ ఎంపీ ఆదాల క్యాంపు కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసిపి నేతలు.. కార్యకర్తల సమావేశం

* నెల్లూరులోని టిడిపి జిల్లా కార్యాలయంలో సిటీ నియోజకవర్గ నేతల సమావేశం

* విశాఖ: నేడు ప్రగతి మహిళా సంఘం (POW ) రాష్ట్ర స్థాయి సదస్సు.. 50 ఏళ్ల ప్రస్థానాన్ని సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న కమిటీ

Exit mobile version