* నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ..
* నేడు తెలంగాణలో కొత్త సర్పంచ్లు, ఉప సర్పంచ్ల ప్రమాణస్వీకారం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాణస్వీకారం చేయనున్న కొత్త సర్పంచ్లు, ఉప సర్పంచ్లు..
* నేడు మధ్యాహ్నం 2గంటలకి జనసేన పార్టీ పదవి- బాధ్యత కార్యక్రమం.. కూటమిలో జనసేన తరపున నామినేటేడ్ పదువులు పొందిన కార్పొరేషన్ చైర్మన్లు.. డైరెక్టర్లు, నీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం కానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కీలక అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న పవన్..
* నేడు ఒంగోలులో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన.. ఉదయం 9 గంటలకు పోలీసు కళాశాలలో మహిళా కానిస్టేబుళ్ల శిక్షణ తరగతులను ప్రారంభించనున్న మంత్రి..
* నేడు భీమవరం, ఏలూరులో అటల్ – మోడీ సుపరిపాలన యాత్ర.. భీమవరంలో ముఖ్యఅతిథిగా హాజరుకానున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. ఏలూరులో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న తమిళనాడు రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షులు అన్నామలై..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 7 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం..
* నేడు సాయంత్రం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై సమీక్ష.. సమీక్షకు హాజరుకానున్న హోంమంత్రి అనిత, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..
* నేడు తిరుమలలో ఆన్ లైన్ లో మార్చి నెల దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. మధ్యాహ్నం 3గంటకు వర్చువల్ సేవా టికెట్లు విడుదల..
* నేడు ఢిల్లీ హైకోర్టులో పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ పిటిషన్లపై విచారణ.. అనుమతి లేకుండా తమ పేర్లు, ఫోటోలు వాడుకోకుండా, ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు..
