Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏర్పాట్లు చేసిన అధికారులు..
నేడు సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం.. మహంకాళి అమ్మవారి బోనాల
జాతరకు అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..
నేడు పెద్ద వాగు వద్ద గండి నీ పరిశీలించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
నేడు గుంటూరు జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
నేడు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
నేడు గుంటూరు కలెక్టరేట్లో, గుంటూరు కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్..
నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి..
నేటి నుంచి చాతుర్మాస ధీక్ష ప్రారంభించనున్న శ్రీవారి ఆలయ జియ్యంగార్లు.. టీటీడీ తరపున జియ్యంగార్లును సత్కరించనున్న అధికార్లు..
నేడు శ్రీశైలం భ్రమరాంబికాదేవికి శాకంబరీ ఉత్సవం.. ఆశాడ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి ఆకుకూరలు, కూరగాయలతో అలంకరణ.. అమ్మవారితో పాటు రాజరాజేశ్వరి, సప్తమాతృకలు, గ్రామదేవతకు శాకాంబరి అలంకరణ
నేడు ఇంద్రకీలాద్రి పై మూడవ రోజు శాకంబరీ దేవిగా దర్శనం ఇస్తున్న కనకదుర్గమ్మ.. ఆషాఢ మాసం సారె సమర్పించే భక్తులతో నిండిన క్యూలైన్లు.. కొండ దిగువన భక్తులకు తప్పని పార్కింగ్ కష్టాలు..
నేటి ఉదయం 11 గంటలకు ఆల్ పార్టీ ఫ్లోర్ లీడర్లతో మీటింగ్ నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం..

Exit mobile version