నేడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రాక.. గన్నవరం విమానాశ్రయానికి 9.30గంటలకు చేరుకుని కానూరుకి వెళ్లనున్న ఏపీసీసీ చీఫ్.. ఉదయం 11 గంటలకు బాధ్యతలు చేపట్టనున్న `వైఎస్ షర్మిల.. అనంతరం బెజవాడలో కాంగ్రెస్ ఆఫీస్ కు వెళ్లనున్న షర్మిల
నేడు జనసేన పార్టీ కార్యాలయంలో కమిటీల సన్నాహక భేటీ.. ఎన్నికల కార్యక్రమాల నిర్వహణకు జనసేనలో జోనల్ కమిటీలు.. పవన్ పాల్గొనే కార్యక్రమాలు, సభల నిర్వహణకు ప్రత్యేక కమిటీలు..
నేడు బెజవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యే వెలంపల్లి పాదయాత్ర.. దూరంగా విష్ణు వర్గం.. విష్ణుని రావాలని పిలిచినా సున్నితంగా తిరస్కరించి న్నట్టు సమాచారం.. ఒంటరిగానే సెంట్రల్ లో పాదయాత్ర ప్రారంభిస్తున్న వెలంపల్లి.. ఈ నెల 25న నియోజకవర్గ క్యాడర్ తో పూర్తి స్థాయిలో సమావేశం పెట్టనున్న విష్ణు.. 25న విష్ణు భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం..
నేడు హోం మంత్రి తానేటి వనిత కొవ్వూరు క్యాంప్ ఆఫీసులో అందుబాటులో ఉంటారు.
నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు..
నేడు ఏఎస్. పేట మండలం హసనాపురం నుంచి విజయిభ యాత్రను ప్రారంభించనున్న ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
నేడు నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని కుసుమ హరిజనవాడలో ఇంటింటా ప్రచారం నిర్వహించనున్న మాజీ మంత్రి నారాయణ.
నేడు నెల్లూరులోని వారధి సెంటర్ ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ.. అనంతరం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్..
నేడు నాయుడుపేటలో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర పాల్గొననున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
నేడు మాచర్ల నియోజక వర్గం, వెల్దుర్తి మండలంలో వరిక పుడిశెల ప్రాంతాన్ని సందర్శించనున్న టీడీపీ నాయకుల బృందం..
నేడు ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్ననున్న నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్..
నేడు రొంపిచర్ల మండలం అన్నవరంలో స్వర్గీయ కోడెల శివప్రసాద్ విగ్రహ ఆవిష్కరణ.. నరసరావుపేట రాజాగారి కోట నుంచి అన్నవరం వరకు భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్న కోడెల అభిమానులు..
నేడు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పర్యటన.. గుంటూరు, తెనాలి, వేమూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో భారీ ర్యాలీ నిర్వహించనున్న బాలశౌరి అనుచరులు, జనసేన శ్రేణులు..
నేడు ఏలూరుకు రానున్న వైసీపీ ఎంపీ కొత్త అభ్యర్ధి కారుమూరి సునీల్.. క్రాంతి కళ్యాణమంటపంలో పార్లమెంటు పరిధిలోని నాయకులతో విస్తృతస్థాయి సమావేశం.. కార్యక్రమానికి హాజరుకానున్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కు సంబందించిన ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలు..
నేడు మాజీమంత్రి కొణతాల రామకృష్ణ అభిమానుల ఆత్మీయ సమావేశం.. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, రాజకీయ భవిష్యత్తుపై సన్నిహితులు, కేడర్ తో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్న కొణతాల.. ఈనెల 27న జనసేనలో చేరాలని కొణతాల నిర్ణయించుకున్నట్టు సమాచారం.. ఇప్పటికే పవన్ తో కలిసి పార్టీలో చేరికపై చర్చించిన కొణతాల
నేడు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం.. నందికొట్కూరు వైసీపీ అభ్యర్థిగా డా. సుధీర్ ను ప్రకటించడంతో అసంతృప్తిలో ఆర్థర్.. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆర్థర్ పై అభిమానుల ఒత్తిడి..
నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేత.. ముగిసిన దర్శనాలు, ప్రత్యేక పూజలతో ఆలయం మూసివేత.. ఆలయానికి ఇప్పటి వరకు రూ. 357 కోట్ల ఆదాయం.. అయ్యప్పస్వామిని దర్శించుకున్న 50 లక్షల మంది భక్తులు..
నేటి నుంచి జింఖానా గ్రౌండ్ లో ఫిజికల్ టికెట్లు విక్రయం.. ఈ నెల 26-29 వరకు ఇండియా- ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్ల విక్రయం.. ఇప్పటి వరకు ఆన్ లైన్ లో 26 వేల టికెట్ల విక్రయం..
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday