* నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన BRSLP సమావేశం.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం.. BRSLP మీటింగ్ లో కీలక నిర్ణయాలు ప్రకటించనున్న కేసీఆర్.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో మూడు బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొదటి సభ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండో సభ, మరో చోట మూడో సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం.. రేపు అధికారికంగా ప్రకటించనున్న కేసీఆర్..
* నేడు తెలంగాణలో కాంగ్రెస్ ఆందోళనలు.. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై నిరసన..
* నేడు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం.. కడ్తాల్ లో పత్రిజీ ఆధ్వర్యంలో 10 వేల మందితో ధాన్యం..
* నేడు కన్హా శాంతివనంలో ధ్యాన దినోత్సవం.. ధ్యాన దినోత్సవానికి హాజరుకానున్న రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు నేతలు హాజరు..
* నేడు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం.. ఉండవల్లిలో కార్యక్రమం ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. 54 లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు..
* నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు.. వైసీపీ కార్యాలయంలో జగన్ పుట్టిన రోజు వేడుకలు..
* నేడు జిల్లాల అధ్యక్షులను ప్రకటించనున్న టీడీపీ అధిష్టానం.. ఇప్పటికే, ఏపీ టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై కసరత్తు పూర్తి..
* నేడు కాకినాడకు అటల్- మోడీ సుపరిపాలన యాత్ర.. కాకినాడలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ.. హాజరు కానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి ఎమ్మెల్యేలు
* నేడు రెండో రోజు అసోంలో ప్రధాని మోడీ పర్యటన.. అమ్మోనియా- యూరియా ప్రాజెక్టుకు శంకుస్థాపన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మోడీ..
* నేడు U-19 ఆసియా కప్ ఫైనల్ లో తలపడనున్న భారత్, పాకిస్థాన్.. ఉదయం 10: 30 గంటలకు దుబాయ్ వేదికగా మ్యాచ్..
* నేటి నుంచి శ్రీలంక- భారతల్ ఉమెన్స్ టీ2 సిరీస్.. శ్రీలంకతో ఐదు టీ20ల ఆడనున్న భారత మహిళల జట్టు..
