నేడు తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం..
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం.. హాజరుకానున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు.. ఈ సమావేశానికి హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు సింగరేణి ఎన్నికలపై హైకోర్టు లో కీలక నిర్ణయం.. ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై కీలక విచారణ.. అధికార పార్టీ గెలుపు కోసమే ఎన్నికల వాయిదాకు ప్రయత్నాలు అంటూ కార్మిక సంఘాల ఆరోపణలు
నేడు చింతపల్లిలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేయనున్న సీఎం..
ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు.. 4 లక్షల 34 వేల మంది 8వ తరగతి విద్యార్థులకు లబ్ధి.. తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్
నేడు రామచంద్రపురం లో సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి వేణు
నేడు కొండేపి ఇన్ ఛార్జ్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం నియోజకవర్గంలో తొలిసారి మంత్రి ఆదిములపు సురేష్ పర్యటన.. టంగుటూరు మండలం వల్లూరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కొండేపిలో సేమీ క్రిస్టమస్ వేడుకలలో పాల్గొననున్న మంత్రి సురేష్..
నేడు నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగే ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొననున్న మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి..
నేడు నెల్లూరులోని బాలాజీ నగర్ వద్ద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
నేడు తాడేపల్లిగూడెంలో సీఎం పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..
నేడు తణుకులో పర్యటించనున్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి
నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా సాలూరు బోస్ బొమ్మ జుంక్షన్ లో కేక్ కటింగ్ చేయునున్న డిప్యూటీ సీఎం పిడిక రాజన్నదొర
నేటి నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్-2 దరాఖాస్తుల స్వీకరణ.. జనవరి 10తో ముగియనున్న దరఖాస్తు గడువు..
నేడు తిరుమలలో ఉదయం 10 గంటలకు మార్చి నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ అధికారులు
నేడు భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా కృష్ణావతారంలో దర్శనం ఇవ్వనున్న స్వామి వారు
నేడు 3 బిల్లుల్ని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం.. మూడు కీలక చట్టాల సవరణ బిల్లులకు లోక్ సభ ఆమోదం..
నేడు భారత్- దక్షిణాఫ్రికా మధ్య చివరి వన్డే.. పార్ల్ వేదికగా సా. 4.30 గంటలకు మ్యాచ్.. 3 వన్డేల సిరీస్ లో 1-1తో సమంగా ఇరుజట్లు
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whatstoday