NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* నేడు రాంచీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పర్యటన.. రాష్ట్రస్థాయి నేతల నుంచి కిందిస్థాయి నేతల వరకు వరుస సమావేశాలు.. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్న అమిత్ షా

* నేడు హర్యానాలో పర్యటించనున్న ఢిల్లీ సీఎం అరవింద్‌ క్రేజీవాల్‌ సతీమణి సునీత క్రేజీవాల్‌.. హర్యానాలో ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సునీత..

* శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద నీరు.. ఇన్ ఫ్లో 37,265 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో నిల్.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 810.90 అడుగులు..

* హైదరాబాద్‌: నేడు సచివాలయంలో ధరణిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష.. ట్రైనీ ఐఏఎస్‌లతో భేటీకానున్న సీఎం.. హెచ్‌ఐసీసీలో కమ్మ సంఘం సమావేశంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌

* హైదరాబాద్‌: నేడు గోపన్‌పల్లిలో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ప్రారంభించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి.

* హైదరాబాద్: నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్ఎస్‌ నేతలు.. నిరుద్యోగులపై కేసులు, పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు

* ప్రకాశం : ఒంగోలులో సీపీఐ విస్తృతస్థాయి సమావేశం, ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ..

* ప్రకాశం: చీమకుర్తిలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ షిరిడి సాయి సేవ సమితి ఆధ్వర్యంలో కోదండ రామస్వామి ఆలయం నుండి సాయిబాబా ఆలయం వరకు మహిళలచే కలశాల ఊరేగింపు కార్యక్రమం..

* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

* తిరుమల: రేపటి నుంచి చాతుర్మాసధీక్ష ప్రారంభించనున్న శ్రీవారి ఆలయ జీయ్యంగార్లు

* విశాఖ: నేడు సింహాచలం గిరి ప్రదక్షిణ.. ఆధ్యాత్మిక యాత్ర కోసం లక్షలాదిగా తరలిరానున్న భక్తులు.. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న స్వామివారి రథం.. ఏటా ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణ చేపట్టి పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించు కోవడం భక్తులకు అలవాటు.. 32 కి.మీ. సాగే గిరి ప్రదక్షిణ కోసం భారీ ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం.. గిరిప్రదక్షిణ కారణంగా నేడు, రేపు నగరంలో వివిధ ప్రధాన కూడళ్ళలో ట్రాఫిక్ డైవర్షన్..

* నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ..

* నెల్లూరు: సోమశిల జలాశయాన్ని సందర్శించనున్న రాష్ట్ర జవాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం

* కృష్ణా జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించిన డీఈవో.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా స్కూల్స్ కి ఇవాళ సెలవు ఇస్తూ ఆదేశాలు

* తూర్పు గోదావరి జిల్లా: నేడు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవు.. భారీ స్థాయిలో వర్ష శాతం నమోదు నేపధ్యంలో సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ , విద్యార్థులకు మాత్రమే సెలవు ప్రకటిస్తున్నామని.. ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది యథావిథిగా హాజరుకావాలని ఆదేశాలు..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలకవర్గం ఎన్నికల పోలింగ్.. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్..

* అన్నమయ్య జిల్లా : నందలూరు శ్రీ స్వామినాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఏడవరోజు శనివారము.. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్య నాథ స్వామి కల్యాణోత్సవం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.సాయంత్రం డోలోత్సవము ఊంజల్ సేవ రాత్రి గజవాహనము నిర్వహింపనున్నారు

* విజయనగరం: భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ఆంగన్వాడి కేంద్రాలకు, పాఠశాలలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్

* పోలవరం ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం.. స్పిల్ వే వద్ద 28.9 మీటర్ల నీటిమట్టం, 48 గేట్ల నుంచి మూడు లక్షల 12వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఉదయం 10 గంటలకు పెరవలి MPDO ఆఫీస్ నందు జనరల్ బాడీ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కందుల దుర్గేష్‌.. మధ్యాహ్నం 12:30 గంటలకు బొమ్మూరు గ్రామంలో ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:00 గంటలకు ఢిల్లీకి పయనం.

* శ్రీ సత్యసాయి : గురు పౌర్ణమి పురస్కరించుకుని హిందూపురం పట్టణంలో 108 రకముల నైవేధ్యములతో ఊరేగింపు.

* నేడు గుంటూరులో పర్యటించనున్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. కలెక్టరేట్‌లో, జీటీహెచ్, ఆర్ అండ్ బీ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న కేంద్ర మంత్రి పెమ్మసాని.

* నేడు రెండవ రోజు, ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, కొనసాగనున్న ఏపీ న్యూరోకాన్ 2024 రాష్ట్ర స్థాయి సదస్సు…

* విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా లో పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించిన విద్యాశాఖ.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సెలవు ఇస్తున్నట్టు ప్రకటనలో తెలిపిన డీఈవో